మనిషిని మింగేసేందుకు ప్రయత్నించిన కొండచిలువ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో

15 అడుగుల కొండ చిలువ వచ్చి అతడిని చుట్టేసింది. దాంతో ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. తప్పించుకోవాలని చూసినా అతడి వల్ల కాలేదు.

Python tries to swallow man (Photo Credit : Google)

Spine Chilling Video : మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ కొండ చిలువ మనిషిని చుట్టేసింది. ఆ తర్వాత అతడిని మింగేసేందుకు ప్రయత్నించింది. ఇంతలో స్పందించిన గ్రామస్తులు ధైర్యం చేసి కొండ చిలువను చంపి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జబల్ పూర్ లో ఓ వ్యక్తి బహిర్భూమికి వెళ్లాడు. ఇంతలో సడెన్ గా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ 15 అడుగుల కొండ చిలువ వచ్చి అతడిని చుట్టేసింది. దాంతో ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. తప్పించుకోవాలని చూసినా అతడి వల్ల కాలేదు. ఆ వ్యక్తిని బలంగా చుట్టుకున్న కొండ చిలువ అతడిని మింగేసేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తం అయ్యారు. కర్రలు, గొడ్డలి, కత్తులతో అక్కడికి చేరుకున్నారు. అతి కష్టమ్మీద కొండ చిలువను చంపి ఆ వ్యక్తిని కాపాడగలిగారు. ఆ వ్యక్తి రెప్పపాటులో చావు నుంచి తప్పించుకున్నాడు. గ్రామస్తులు ధైర్యం చేసి కొండ చిలువను చంపి ఉండకపోతే.. ఆ వ్యక్తి దానికి బలైపోయేవాడు.

జబల్‌పూర్‌లోని కళ్యాణ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కొండచిలువ దాడి నుంచి తప్పించుకుని ప్రాణాలతో ఆ వ్యక్తి బయటపడం నిజంగా మిరాకిల్ అంటున్నారు. గ్రామస్తులు వెంటనే స్పందించడంతో ఆ వ్యక్తి మృత్యువు నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. బాధితుడు బహిర్భూమి కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఇంతలో వెన నుంచి వచ్చిన కొండచిలువ అమాంతం ఆ వ్యక్తిని బలంగా చుట్టుకుంది. తన తోకతో అతడి మెడను చుట్టేసింది. దీంతో ఆ వ్యక్తి తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దాన్ని నుంచి తప్పించుకోవడం అతడి వల్ల కాలేదు. అయితే, ప్రాణాంతకమైన కొండచిలువ తనను మింగేయకుండా దాన్ని నోటిని అదిమిపెట్టాడు. ఆ వ్యక్తి కేకలు, అరపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి వచ్చారు. కొండ చిలువను చూసి భయపడిపోయారు. అయితే, వ్యక్తిని కాపాడేందుకు గ్రామస్తులు వెంటనే రంగంలోకి దిగారు. రాళ్లు, పదునైన ఆయుధాలు, గొడ్డలితో కొండచిలువపై దాడి చేశారు. దాంతో కొంచిలువ ఆ వ్యక్తిని వదిలేసింది. అలా ఆ వ్యక్తి రెప్పపాటులో చావు నుంచి బయటపడ్డాడు.

Also Read : మ‌ల‌క్‌పేట‌ అంధ బాలికల వసతి గృహంలో అమానుషం.. మంత్రి సీతక్క సీరియస్

ట్రెండింగ్ వార్తలు