Telangana : రైతులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు, ఈసారి 70లక్షల మంది..

Telangana : వానాకాలం పంటకు సంబంధించి 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించనున్నాం.

Rythu Bandhu (Photo : Google)

Telangana – Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు సాయం విడుదల చేయనుంది. సోమవారం నుంచి లబ్దిదారుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు చెప్పారు.

ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 70 లక్షల మంది ఖాతాల్లో రూ.7వేల 720 కోట్లు జమ చేస్తామన్నారు. కొత్తగా 1.50 లక్షల పోడు రైతులకు కూడా రైతుబంధు అందజేస్తామన్నారు. గత సీజన్ తో పోలిస్తే.. ఈసారి కొత్తగా 5లక్షల మంది లబ్దిదారులు పెరిగినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కొత్తగా చేరిన లబ్దిదారులతో మరో 300 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది.

Also Read..Psychiatric surgery: భారత్‌లో మొట్టమొదటిసారి సైకియాట్రిక్ సర్జరీ.. డిప్రెషన్ దూరం

”వానాకాలం పంటకు సంబంధించి 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించనున్నాం. ఈసారి 1.5లక్షల మంది పోడు రైతులకు(సుమారు 4 లక్షల ఎకరాలకు) సైతం రైతుబంధు అమలు చేయనున్నాం. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7720.29 కోట్లు జమ కానున్నాయి. 1.54 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందనుంది” అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీమ్ రైతుబంధు. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున ఇస్తోంది. ఇప్పటికే 10 విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది ప్రభుత్వం. తాజాగా 11వ విడతలో భాగంగా సోమవారం (జూన్‌ 26) నుంచి లబ్దిదారుల బ్యాంకు అకౌంట్స్ లో రైతుబంధు ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు. 11వ విడతతో రైతుబంధు సాయం మొత్తం రూ.72,910 కోట్లకు చేరనుంది.

కోటి 54 లక్షల ఎకరాలకు సాయం అందనుంది. 10వ విడత వరకు రూ.65,190 కోట్లు జమ చేసింది ప్రభుత్వం. ఎప్పటి మాదిరిగానే ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లోకి నిధులు జమకానున్నాయి. ఈసారి కొత్తగా మొదటిసారి రైతుబంధు సాయం తీసుకోనున్న రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను బ్యాంకు అకౌంట్ వివరాలతో సంప్రదించాలి. దేశంలో ఏడాదికి రెండుసార్లు చొప్పున ఎకరాకు రూ.10 వేలు సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వానాకాలం రైతుబంధు నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

Also Read..New Car Buying Guide : కొత్త కారు కొంటున్నారా? కొనే ముందు ఈ 5 విషయాలను తప్పక గుర్తుపెట్టుకోండి..!

ట్రెండింగ్ వార్తలు