Heavy Rain : హైదరాబాద్ లో దంచికొడుతున్న వాన.. రాత్రంతా కురుస్తూనే ఉన్న వర్షం

రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు.

Heavy Rain In Hyderabad (1)

Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. రాత్రంతా వర్షం కురుస్తూనేవుంది. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కు కూడా అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు రోజులు గ్రేటర్ లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.

ఖైరతాబాద్, అమీర్ పేట, సోమాజిగూడ, నాంపల్లి, మలక్ పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, హస్తినాపురం, బీఎన్ రెడ్డి, నాగోల్, ఉప్పల్, హబ్బిగూడ, తార్నాక, ఈసీఐఎల్, సికింద్రాబాద్, బేగంపేట్, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైస్, బోయిన్ పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, చిలకలగూడలో వర్షం కురుస్తోంది.

Fish Rain : శ్రీకాకుళం జిల్లాలో చేపల వర్షం.. రోడ్లపై చేపలు చూసి ఎగబడిన జనం

కూకట్ పల్లి, హైదర్ గూడ, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెచ్ బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మియాపూర్, కుత్బల్లాపూర్, బీహెచ్ఈఎల్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహిదీపట్నంలో వర్షం దంచికొడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించింది. తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం కూడా కురిసింది.

ట్రెండింగ్ వార్తలు