Tech Tips in Telugu : మీ మొబైల్ సిగ్నల్ సరిగా లేదా? ఈ టిప్స్‌తో ఫోన్‌లో ఫుల్ సిగ్నల్ వస్తుంది.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

Tech Tips in Telugu : మొబైల్ డేటా వినియోగానికి తప్పనిసరిగా సెల్యూలర్ నెట్‌వర్క్ ఉండాల్సిందే. ఫోన్ సిగ్నల్ సరిగా లేకపోతే మెసేజ్, కాల్స్ చేసుకోలేరు. ఈ సమస్యలను పరిష్కారించాలంటే ఇప్పుడే ఈ టిప్స్ పాటించండి.

How to boost your mobile signal _ Tips and techniques for improved connectivity

Tech Tips in Telugu : మీ మొబైల్ ఫోన్ సిగ్నల్ సరిగా ఉండటం లేదా? ఫోన్ కాల్స్ చేసుకోవాలన్నా, ఎవరికైనా మెసేజ్ పంపాలన్నా తప్పనిసరిగా మొబైల్ సిగ్నల్ ఉండాల్సిందే. లేదంటే ఫోన్ కాల్స్ చేసుకోలేరు. మొబైల్ అనేది కేవలం కమ్యూనికేషన్ డివైజ్ మాత్రమే కాదు.. వర్క్, ఎంటర్‌టైన్మెంట్ సహా అనేక ఇతర సర్వీసులకు కూడా మొబైల్ ఫోన్లు ఉపయోగపడతాయి. స్మార్ట్‌ఫోన్‌లలోని యాప్‌లకు నావిగేషన్, బిల్లులు చెల్లించడం, వీడియో కాల్‌లు చేయడం, ఫోటోలు/వీడియోలు తీయడం, షాపింగ్ చేయడం, గేమ్‌లు ఆడడం వంటి మరెన్నో పనులను పూర్తి చేసుకోవచ్చు.

వీటన్నింటికీ మీ ఫోన్‌లో సిగ్నల్ సరిగా ఉండటం చాలా ముఖ్యం. స్మార్ట్‌ఫోన్‌లు సిగ్నల్ స్ట్రెంగ్త్‌ను నమోదు చేయనప్పుడు కాల్ డ్రాప్‌లు, మెసేజ్ వెళ్లకపోవడం, అవుట్‌బాక్స్ ఇమెయిల్‌లు, డౌన్‌లోడ్ స్పీడ్ నెమ్మదించడం, వాయిస్ క్వాలిటీ తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లో సిగ్నల్ స్ట్రెన్త్ పెంచడానికి కొన్ని టెక్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

* ముందుగా మీ ఫోన్‌ని రీబూట్ చేయండి.
* మీ సిగ్నల్ సమస్యను కనీసం 50శాతం పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి.
* ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను టోగుల్ (Toggle) చేయండి.
* ‘Airplane’ మోడ్‌ ON లేదా OFF చేయాలి.
* ఫోన్ నెట్‌వర్క్ మళ్లీ చెక్ చేస్తుంది. ఐఫోన్ కంట్రోల్ సెంటర్ లేదా ఆండ్రాయిడ్ త్వరిత సెట్టింగ్‌ల నుంచి Airplane మోడ్‌ని యాక్సెస్ చేయవచ్చు.
* మీ SIM కార్డ్‌ సరిగా ఉందో లేదో చెక్ చేయండి.
* సిగ్నల్ స్ట్రెన్త్ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించే సిమ్ కార్డ్ టైప్‌‌పై ఆధారపడి ఉంటుంది.
* సిమ్ కార్డ్ కండిషన్‌పై ఆధారపడి, సిగ్నల్ స్ట్రెన్త్ ఎఫెక్ట్ అవుతుంది.
* సిమ్ కార్డ్‌పై డెస్ట్ ఉంటే.. సిగ్నల్ ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
* మీ సిమ్ కార్డ్‌ను మైక్రోఫైబర్ క్లాత్‌తో సరిగ్గా శుభ్రం చేశారని నిర్ధారించుకోండి.

Read Also : Mark Zuckerberg Phone : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వాడే ఫోన్ ఇదేనట.. ఐఫోన్ మాత్రం కాదు.. అదేంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం..!

మీ సిమ్ కార్డ్‌ రీప్లేస్ చేయండి : అదే సమస్య కొనసాగితే.. సిమ్ కార్డ్ పాడయ్యే అవకాశం ఉంది. చిన్న గీతలు కూడా సిగ్నల్ బలానికి ఆటంకం కలిగిస్తాయి. కొత్త సిమ్ కార్డ్‌తో భర్తీ చేయాలని సూచిస్తాయి.

మీ నెట్‌వర్క్ ‘G’ 2G/3G/4G/5Gకి మార్చండి :
కొన్ని ప్రాంతాలకు 4G లేదా 5G నెట్‌వర్క్‌ల ఫుల్ సిగ్నల్ స్ట్రెన్త్ లేదు. స్మార్ట్‌ఫోన్‌లలో బలహీనమైన సిగ్నల్ ఉంటే.. నెట్‌వర్క్ మోడ్‌ను మార్చవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు 4G లేదా 5G నెట్‌వర్క్‌ల నుంచి 2G లేదా 3G నెట్‌వర్క్‌లకు మారవచ్చు. అయినప్పటికీ, నిర్దిష్ట స్మార్ట్‌ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయకపోవచ్చు. వినియోగదారులు తమ ఫోన్‌లలో నెట్‌వర్క్ మోడ్‌ను మాన్యువల్‌గా ఎంచుకోవాలి.

How to boost your mobile signal _ Tips and techniques for improved connectivity

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం :
* నెట్‌వర్క్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
* సిమ్ కార్డ్ సెట్టింగ్‌లను నొక్కండి.
* ఎడ్జెస్ట్ చేయడానికి సిమ్ కార్డ్ స్లాట్‌ను (ఫోన్ మల్టీ సిమ్ కార్డ్‌లను అనుమతిస్తే) నొక్కండి.
* ‘ప్రైమరీ నెట్‌వర్క్ టైప్’ నొక్కండి
* నెట్‌వర్క్ టైప్ ఆప్షన్‌పై Tap చేయండి. (4G లేదా 5G కన్నా తక్కువ)

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఈ సెట్టింగ్‌లను ట్వీక్ చేయడం వల్ల తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో సిగ్నల్ స్ట్రెన్త్ పెరుగుతుంది.

ఐఫోన్ యూజర్ల కోసం :
* సెట్టింగ్‌ (Settings)లకు వెళ్లండి.
* సెల్యులార్ ఆప్షన్ ఎంచుకోండి.
* సెల్యులార్ డేటా ఆప్షన్‌లో ‘4G Start’ టోగుల్‌ని Stop చేయండి.
* ఈ సెట్టింగ్‌లను ట్వీకింగ్ చేసిన తర్వాత 5G లేదా 4G నెట్‌వర్క్‌లు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో iPhone సిగ్నల్ పెరుగుతుంది.
* సెల్యులార్ నెట్‌వర్క్‌లకు బదులుగా Wifiని ఉపయోగించండి.
* చాలా స్మార్ట్‌ఫోన్‌లు Wifi కాలింగ్‌కు సపోర్టు ఇస్తాయి. మొబైల్ సిగ్నల్ సమస్య ఉంటే.. ఫోన్‌లోని కాలర్ సెట్టింగ్‌లలో దీన్ని యాక్టివేట్ చేయవచ్చు.
* మీరు పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లో కాకుండా విశ్వసనీయ Wi-Fi నెట్‌వర్క్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయడం మంచిది.

Read Also : Twitter X Blue Ticks : ట్విట్టర్ (X) పెయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. ఇకపై ‘బ్లూ టిక్’ హైడ్ చేసుకోవచ్చు..!

ట్రెండింగ్ వార్తలు