Credit Score : బిల్లు పేమెంట్స్ సరిగా కడుతున్నా మీ క్రెడిట్ స్కోరు పెరగడం లేదా? కారణాలు తెలిస్తే షాకవుతారు!

Credit Score : ఒక వినియోగదారుడి క్రెడిట్ స్కోరు పెరగలన్నా లేదా తగ్గలన్నా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR)పై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

Why your credit score is not improving despite timely payments ( Image Source : Google )

Credit Score : ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతిఒక్కరూ తమ అవసరాల కోసం క్రెడిట్ కార్డులనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. క్రెడిట్ కార్డు వాడకం విషయంలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. అన్ని సరిగా ఉందని భావిస్తుంటారు. సరైన సమయానికి బిల్లు పేమెంట్స్ కడుతున్నాం కదా అని అంటుంటారు. అయినప్పటికీ వారి క్రెడిట్ స్కోరు చూస్తే చాలా తక్కువగా ఉంటుంది.

Read Also : Credit Card New Rules : క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఈ 4 బ్యాంకుల క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్‌.. తప్పక తెలుసుకోండి!

సాధారణంగా గడువు తేదీలోగా బిల్లు పేమెంట్స్ చేయనివారి క్రెడిట్ స్కోరు పడిపోతుంది. దీనికి కారణాలు అనేకం ఉంటాయి. క్రెడిట్ స్కోరు సరిగా లేకుంటే భవిష్యత్తులో ఏదైనా బ్యాంకు లోన్లు తీసుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే క్రెడిట్ స్కోరు విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. క్రెడిట్ స్కోరు పెంచుకోవడానికి సకాలంలో బిల్లు పేమెంట్స్ చేయడం ఒక్కటే కాదు.. ఇంకా మరికొన్ని విషయాలపై కూడా తప్పనిసరిగా దృష్టిపెట్టాలి.

క్రెడిట్ స్కోరు తగ్గడానికి కారణాలివే :
ఒక వినియోగదారుడి క్రెడిట్ స్కోరు పెరగలన్నా లేదా తగ్గలన్నా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR)పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఎందుకంటే.. కార్డు లిమిట్ ఆధారంగా మీ వాడకం ఉండాలి. ప్రతి కార్డుకు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లోబడి మాత్రమే డబ్బులు తీసుకోవాలి. అంతకంటే ఎక్కువగా వాడేస్తే అది మీ క్రెడిట్ స్కోరుపై ఎఫెక్ట్ పడుతుందని గుర్తించాలి. మీ ఆదాయ పరిమితికి మించి ఉండకూడదు. మీరు తీసుకునే రుణం ఏదైనా సరే.. లేదంటే అప్పుల ఊబిలో చిక్కుకుంటారు జాగ్రత్త. క్రెడిట్ స్కోరు తగ్గడానికి మరికొన్ని కారణాలను ఓసారి పరిశీలిద్దాం..

అవసరం లేకున్నా కొత్త క్రెడిట్ కార్డులను తీసుకుంటారు. ఇది సరికాదు. రివార్డుల కోసమో లేదో రుణాల కోసమో క్రెడిట్ కార్డులను తీసుకోకూడదు. పదేపదే కొత్త క్రెడిట్ కార్డుల కోసం అప్లయ్ చేయకూడదు. లోన్లు తీసుకునే సమయంలో ఇతరుల కోసం ఎప్పుడూ చేయకూడదు. ఒకవేళ వారు ఆ లోన్ చెల్లించకపోతే మీపై భారం పడుతుంది. మీ ఆదాయం కన్నా రుణ నిష్పత్తి పెరగడం వల్ల క్రెడిట్ స్కోరు అమాంతం తగ్గిపోయే ప్రమాదం ఉంది.

మీ క్రెడిట్ స్కోరు చెక్ చేసుకునే సమయంలో కాస్తా లోతుగా విశ్లేషించండి. ఎందుకంటే.. క్రెడిట్ స్కోరుతో పాటు క్రెడిట్ రిపోర్టులోని ఇతర అంశాలను కూడా తెలుసుకోండి. ఆ తప్పులు ఏంటో మీరు గుర్తించి సరి చేసుకుంటే క్రెడిట్ స్కోరు ఎందుకు తగ్గింది అనేది తెలుస్తుంది. ఆయా తప్పులను సరిదిద్దుకుంటూ చెల్లించాల్సిన పేమెంట్స్ సమయానికి పూర్తిచేస్తుంటే క్రమంగా మీ క్రెడిట్ స్కోరు పెరుగుతూపోతుంది.

Read Also : మీ CIBIL SCORE స్కోరు ఎంత ఉండాలి? మీకు ఎంత స్కోర్ ఉంటే లోన్ వస్తుంది? ఎలా లెక్కిస్తారు?

ట్రెండింగ్ వార్తలు