Credit Card New Rules : క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఈ 4 బ్యాంకుల క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్‌.. తప్పక తెలుసుకోండి!

Credit Card New Rules : మే 2024లో ఈ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్ ప్రవేశపెట్టాయి. ప్రత్యేకించి కొన్ని బ్యాంకులు, కార్డ్ జారీచేసే సంస్థలు ఈ నెలలో తమ క్రెడిట్ కార్డ్ సంబంధిత రుసుములు, ఛార్జీలు, నియమాలను సవరించాయి.

Credit Card New Rules : క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఈ 4 బ్యాంకుల క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్‌.. తప్పక తెలుసుకోండి!

These 4 banks credit card rules ( Image Credit : Google )

Credit Card New Rules : క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే, ఇది మీకోసమే.. మీరు వాడే క్రెడిట్ కార్డులు ఈ 4 బ్యాంకులకు సంబంధించి వాడుతుంటే తప్పక ఈ విషయాలను తెలుసుకోండి. ఎందుకంటే.. మే 2024లో ఈ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్ ప్రవేశపెట్టాయి. ప్రత్యేకించి కొన్ని బ్యాంకులు, కార్డ్ జారీచేసే సంస్థలు ఈ నెలలో తమ క్రెడిట్ కార్డ్ సంబంధిత రుసుములు, ఛార్జీలు, నియమాలను సవరించాయి.

Read Also : Bajaj Fighter CNG Bike : ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ ‘బజాజ్ ఫైటర్’ కొత్త బైక్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ముందుగా క్రెడిట్ కార్డ్ కస్టమర్లు క్రెడిట్ కార్డుల్లో జరిగిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి. బ్యాంక్ లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీ నిర్ణయించిన లేటెస్ట్ రుసుము, అలాగే బ్యాంకు సంబంధిత మార్గదర్శకాలను తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఈ నెలలో తమ క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరించిన టాప్ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) :
బ్యాంకు ఆఫ్ బరోడా (BOBCARD One) సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌పై వడ్డీ రేటు, ఆలస్య చెల్లింపు రుసుములను పెంచింది. గెట్‌వన్‌కార్డు (GetOnecard) వెబ్‌సైట్‌లోని అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతుల పేజీల ప్రకారం.. పెంచిన రేట్లు జూన్ 26, 2024 నుంచి అమలులోకి వస్తాయి.

వన్ వెబ్‌సైట్ ప్రకారం.. “మీరు ఆమోదించిన క్రెడిట్ లిమిట్‌లో (BOBCARD One) కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినంత కాలం, గడువు తేదీలోపు పూర్తి బకాయిని చెల్లించినంత వరకు ఎలాంటి వసూలు చేయొదు. అయితే, బిల్ పేమెంట్లు లేదా ఏదైనా పేమెంట్‌లలో జాప్యం జరగడం లేదా లిమిట్‌కు మించి మీ కార్డ్‌ని ఉపయోగిస్తే మాత్రం కొన్ని ఛార్జీలు విధిస్తాయని గమనించాలి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) :
హెచ్‌డీఎఫ్‌సీ అత్యంత పాపులర్ క్రెడిట్ కార్డ్‌లలో ఒకటైన (Swiggy HDFC) బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు మెరుగైన క్యాష్‌బ్యాక్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. చాలా మంది కార్డ్ జారీచేసే సంస్థలు క్రెడిట్ కార్డ్‌లతో ఇంటిగ్రేట్ చేసిన బెనిఫిట్స్, పెర్క్‌లను తగ్గిస్తున్న నేపథ్యంలో ఈ మార్పు జరిగింది.

జూన్ 21, 2024 నుంచి స్విగ్గీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొత్త క్యాష్‌బ్యాక్ స్ట్రక్చర్‌ను కలిగి ఉంటుందని తాజా వర్గాలు పేర్కొన్నాయి. సంపాదించిన క్యాష్‌బ్యాక్ ఇకపై స్విగ్గీ యాప్‌లో స్విగ్గీ మనీగా కనిపించదు. దానికి బదులుగా, వచ్చే జూన్ 21 నాటికి క్రెడిట్ కార్డ్ అకౌంట్లలో మాత్రమే కనిపించనుంది. ఈ క్యాష్‌బ్యాక్ ఫలితంగా వచ్చే నెలలో స్టేట్‌మెంట్ బ్యాలెన్స్ తక్కువగా ఉంటుంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ (IDFC) :
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, చెల్లించిన యూటిలిటీ బిల్లుల కోసం క్రెడిట్ కార్డ్ చెల్లింపుల మొత్తం రూ. 20వేలు దాటితే ఒక శాతం+ జీఎస్టీ ​​అదనంగా విధించనున్నట్లు తెలిపింది. ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డ్, ఎల్‌ఐసీ క్లాసిక్ క్రెడిట్ కార్డ్, ఎల్‌ఐసీ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ యుటిలిటీ సర్‌ఛార్జ్‌కి లోబడి ఉండవు. స్టేట్‌మెంట్ సైకిల్‌లో మీ యుటిలిటీ బిల్లు లావాదేవీలు (గ్యాస్, విద్యుత్, ఇంటర్నెట్) మొత్తం రూ. 20వేలు లేదా అంతకంటే తక్కువ ఉంటే సర్‌ఛార్జ్ ఉండదు. అయితే, రూ. 20వేలు దాటితే, ఒక శాతం సర్‌ఛార్జ్‌పై అదనంగా 18శాతం జీఎస్టీ ఉంటుంది.

యెస్ బ్యాంక్ ( Yes Bank) :
యెస్ బ్యాంక్ ‘ప్రైవేట్’ క్రెడిట్ కార్డ్ టైప్ మినహాయించి ఆ బ్యాంకు సంబంధిత అన్ని క్రెడిట్ కార్డ్‌లపై అనేక రకాల అంశాల్లో మార్పులు చేసింది ముఖ్యంగా కొన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రకాలపై ఇంధన రుసుము కేటగిరీ మాత్రమే ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులతో ‘ప్రైవేట్’ మినహా, వార్షిక, జాయినింగ్ ఫీజులు వంటి ఇతర రుసుముల ఖర్చు స్థాయి గణనతో లింక్ అయి ఉంటాయి. యూటిలిటీ లావాదేవీలపై అదనపు రుసుము పరంగా కూడా మార్పు జరిగింది.

Read Also : Hero Splendor Launch : హీరో స్ప్లెండర్ కొత్త బైక్ మోడల్ వచ్చేసిందోచ్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ..!