డ్రగ్స్ వాడితే ఉపేక్షించేది లేదు.. 5 ప్రధాన పబ్బులపై ఏకకాలంలో దాడులు..

నలుగురిలో ఒకరు మైనర్, మరొకరు డీజే నిర్వాహకుడు ఉన్నట్లు తెలిపారు.

హైదరాబాద్ లోని పబ్బులపై ఎక్సైజ్, టీజీ న్యాబ్ జాయింట్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. సిటీలోని 5 ప్రధాన పబ్బులపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. నలుగురు డ్రగ్ వినియోగించినట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టీజీ న్యాబ్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్ అధికారులు గుర్తించారు.

నలుగురిలో ఒకరు మైనర్, మరొకరు డీజే నిర్వాహకుడు ఉన్నట్లు తెలిపారు. నిన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, నార్కోటిక్ బ్యూరో అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో ఇప్పటి వరకు 14 మందికి డ్రగ్స్ టెస్టుల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నప్పటికీ దాని ఊబిలో నుంచి బయటపడలేకపోతున్నారు చాలా మంది. డ్రగ్స్ విక్రయించినా, వాడినా ఉపేక్షించబోమని పోలీసులు ఇప్పటికే పలుసార్లు హెచ్చరించారు.

Also Read: విశాఖపట్నంలో వర్ష బీభత్సం.. ప్రమాదం అంచున నివాసాలు, భయాందోళనలో ప్రజలు

ట్రెండింగ్ వార్తలు