నటుడు మురళీమోహన్‌కు హైడ్రా షాక్..!

అక్రమ కట్టడాలను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఇతరు అధికారులు.. జయభేరి సంస్థ...

Murali Mohan : ప్రముఖ నటుడు, నిర్మాత, రియల్ ఎస్టేటర్ మురళీమోహన్ కు షాక్ ఇచ్చింది హైడ్రా. ఆయన రియల్ ఎస్టేట్ సంస్థ జయభేరికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ నానక్ రామ్ గూడ రంగాళ్ కుంట చెరువు ఎఫ్ టీఎల్ బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాలు తొలగించాలని హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఆ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు అధికారులు. అక్రమ కట్టడాలను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్, ఇతరు అధికారులు.. జయభేరి సంస్థ మూడు అడుగుల మేర రేకుల షెడ్డు నిర్మించినట్లు గుర్తించారు. దీంతో మురళీమోహన్ కు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోగా అక్రమ కట్టడాలు తొలగించాలని, లేకుంటే కూల్చేస్తామని హైడ్రా హెచ్చరించింది.

Also Read : అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా సంచలన నిర్ణయం..

హైడ్రా నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతున్నానని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టలేదని అన్నారు. జయభేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదన్నారు. బఫర్ జోన్ లో షెడ్ ఉందని, దాన్ని తామే తొలగిస్తామని తెలిపారు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు అక్కడికి వచ్చారని, ఏనాడు అవకతవకలకు పాల్పడలేదని మురళీమోహన్ స్పష్టం చేశారు. హైడ్రా 15 రోజుల సమయం ఇచ్చినా.. తాము రెండు రోజుల్లో తాత్కాలిక షెడ్లను తొలగిస్తామని చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు