Cockroach Stuck Throat : నిద్రపోతున్న వ్యక్తి గొంతులో దూరిన బొద్దింక.. ఆ తర్వాత ఏమైందంటే?

Cockroach Throat : చైనాకు చెందిన ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉండగా అతడి ముక్కలోకి బొద్దింక దూరింది. అది కాస్తా మెల్లగా గొంతులోకి వెళ్లి చిక్కుకుంది.

Man Wakes Up To Find Cockroach Stuck In Throat ( Image Source : Google )

Cockroach Stuck Throat : ప్రతి ఇంట్లో బొద్దింకలు సాధారణం.. ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ బొద్దింకలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఈ బొద్దింకలు ఇంట్లో వస్తువుల కింద, వస్త్రాల కింద నక్కుతుంటాయి. కానీ, మనిషి ముక్కులోకి దూరడం వంటి ఘటనలు చాలా అరుదు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. చైనాకు చెందిన ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉండగా అతడి ముక్కలోకి బొద్దింక దూరింది. అది కాస్తా మెల్లగా గొంతులోకి వెళ్లి చిక్కుకుంది.

గొంతులో దూరిన బొద్దింక :
58 ఏళ్ల చైనీస్ వ్యక్తి శ్వాసనాళంలో బొద్దింక ఉన్నట్లు గుర్తించిన తర్వాత ఎంటోమోఫోబ్ అనుభవించాడు. ఒక రాత్రి మనిషి నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తన నోట్లో ఏదో పాకుతున్న వింత అనుభూతికి మెలకువ వచ్చింది. వెంటనే అతడు ఆశ్చర్యపోయాడు.

Read Also : Viral Video : మహిళతో ఆటో డ్రైవర్ తీవ్ర వాగ్వాదం.. ఓలా రైడ్ రద్దు చేసిందని చెంపదెబ్బ కొట్టాడు.. వీడియో!

అది తన గొంతులో నుంచి జారిపోతున్నట్లు భావించాడు. క్రమంగా దగ్గు వచ్చింది. అయినా అది నోట్ల నుంచి బయటకు రాలేదు. స్థానిక చైనీస్ న్యూస్ అవుట్‌లెట్ ప్రకారం.. తనకు ఏమి జరిగిందో తెలియదు. చివరికి నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటి రోజున అది మరిచిపోయి తన పనులను చేసుకున్నాడు. తరువాతి మూడు రోజులలో శ్వాస నుంచి దుర్వాసన రావడం గమనించాడు. బ్రష్ చేయడం, నోటి పరిశుభ్రత చేసినా నోటి దుర్వాసన అలానే వచ్చింది. దగ్గుతో పాటు పసుపు కఫం కూడా పడింది. చివరికి వైద్యసాయం కోసం డాక్టర్‌ను సంప్రదించాడు.

ఎగువ శ్వాసనాళంలో చిక్కిన బొద్దింక :
చైనాలోని హైనాన్ ప్రావిన్స్‌లో ఉన్న హైకౌకు చెందిన వ్యక్తి హైనాన్ ఆసుపత్రికి వెళ్లి ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించాడు. అతని ఎగువ శ్వాసనాళాన్ని పరిశీలించగా అసాధారణంగా ఏమీ కనిపించలేదు. ఏదో తప్పు జరిగిందని అనుమానంతో మరో డాక్టర్ లిన్ లింగ్‌కు సిఫార్సు చేశాడు. డాక్టర్ లిన్ ఛాతీ సీటీ స్కాన్ చేయగా కుడి దిగువ ఊపిరితిత్తుల లోబ్ పృష్ఠ బేసల్ విభాగంలో ఏదో నీడ ఉన్నట్టుగా గుర్తించారు.

ఏదో వస్తువు అక్కడ చిక్కుకుపోయిందని సూచించింది. అదేంటో తెలుసుకునేందుకు బ్రోంకోస్కోపీని సిఫార్సు చేశారు. “ఈ ప్రక్రియలో అతడి శ్వాసనాళంలో రెక్కలతో ఏదో స్పష్టంగా చూశాను.. అది కఫంతో నిండి ఉంది” అని డాక్టర్ లిన్ చెప్పారు.

బొద్దింకను తొలగించిన వైద్యులు :
చుట్టుపక్కల ఉన్న కఫాన్ని తొలగించిన తర్వాత అది బొద్దింక అని గుర్తించినట్టు తెలిపారు. ఎట్టకేలకు బాధితుడి శ్వాసనాళం నుంచి ఆ బొద్దింకను జాగ్రత్తగా తొలగించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేయగా దుర్వాసన కూడా పోయింది. అనంతరం అతడు పూర్తిగా కోలుకున్నాడు.

మరుసటి రోజునే డిశ్చార్జ్ అయ్యాడు. ఇలాంటి అసాధారణమైన కేసులు చాలా అరుదుగా ఉన్నాయని డాక్టర్ లిన్ పేర్కొన్నారు. దిగువ శ్వాసకోశంలో ఏదైనా ఉన్నట్టు అనుమానం కలిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.

Read Also : Viral Video : బిలియనీర్ సర్‌ప్రైజ్ గిఫ్ట్.. అభిమాని కోసం లక్షల ఖరీదైన వాచ్.. వీడియో!

ట్రెండింగ్ వార్తలు