Bandi Sanjay: తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ అనుకుంటే కాదు.. ప్రజలు అనుకోవాలి

తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టుకు వచ్చిన నేతలతో నోవాటెల్‌లో నడ్డా సమావేశం అయ్యారు.

Bandi Sanjay:  తెలంగాణ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తనకు ఆహ్వానం పలికేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన నేతలతో నోవాటెల్‌లో నడ్డా సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉంది. శనివారం జేపీ నడ్డాతో ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి సమావేశం అయిన నేపథ్యంలో ఈ మీటింగ్‌లో ఏ అంశాలు చర్చకు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఢిల్లీ వెళ్లిన ఈటల రాజేందర్,  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఢిల్లీలోనే ఉండటం గమనార్హం.

Gidugu Rudra Raju : సోనియాగాంధీని చెడుగా చూపిస్తే బట్టలు ఊడదీసి కొడుతాం.. రాంగోపాల్ వర్మకు గిడుగు రుద్రరాజు వార్నింగ్

నడ్డాకు స్వాగతం పలికేందుకు వచ్చిన తెలంగాణ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ నోవాటెల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, ప్రజలంతా బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచింది బీజేపీ.. కాంగ్రెస్ కాదన్న విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తామే ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్ అనుకుంటే కాదు.. ప్రజలు అనుకోవాలి అని బండి సంజయ్ అన్నారు. ఎన్నికల్లో డిపాజిట్‌లు ఎవరివి పోతున్నవో అందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్ అద్దాల మెడలో ఉంది.. సంతోష పడుతుందని ఎద్దేవా చేశారు.

CM KCR: భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. రెండ్రోజులు అక్కడే మకాం.. బీఆర్ఎస్‌ తీర్థంపుచ్చుకోనున్న పలువురు నేతలు

అవినీతి, కుటుంబ పాలనపై డేగ కళ్ళతో కేంద్రం చూస్తుందని అన్నారు. బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని కోమటి రెడ్డి, జానా రెడ్డిలు చెప్పారు. బీజేపీ గెలువొద్దని కేసీఆర్ భావిస్తున్నారు అని సంజయ్ అన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వాళ్ళు ఎలాగూ తన పార్టీ‌లోకి వస్తారని కేసీఆర్ అనుకుంటున్నాడు. 30మంది కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ పెంచి పోషిస్తున్నాడు. పాకెట్ మనీ ఇస్తున్నాడు. ఇంకేముంది.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ఒకటే బీఆర్ఎస్ గెలిచిన ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ విమర్శలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు