CM KCR: భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. రెండ్రోజులు అక్కడే మకాం.. బీఆర్ఎస్‌ తీర్థంపుచ్చుకోనున్న పలువురు నేతలు

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళ వారాల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నారు. భారీ కాన్వాయ్‌తో రోడ్డుమార్గం ద్వారా వెళ్తారు.

CM KCR Maharashtra Tour: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సోమ, మంగళ వారాల్లో (26, 27 తేదీల్లో) మహారాష్ట్ర (Maharashtra) లో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) నుంచి మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరుతారు. ఈసారి రోడ్డు మార్గం ద్వారా కేసీఆర్ మహారాష్ట్ర వెళ్తారు. హైదరాబాద్ నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి భారీ కాన్వాయ్‌లో రోడ్డు మార్గం ద్వారా మహారాష్ట్రంలోని సోలాపూర్‌కు కేసీఆర్ చేరుకుంటారు. సోలాపూర్‌లోని పలువురు మహారాష్ట్ర నేతలు, తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికుల కుటుంబాలు సీఎం కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

Bandla Ganesh : మళ్ళీ కాంగ్రెస్‌లోకే బండ్ల గణేష్.. భట్టి విక్రమార్క పాదయాత్రలో బండ్లన్న..

సీఎం కేసీఆర్, తెలంగాణ నుంచి వెళ్లిన ప్రజాప్రతినిధులంతా సోలాపూర్‌లోనే సోమవారం రాత్రి బస చేయనున్నారు. 27వ తేదీ (మంగళవారం) సోలాపూర్‌లో పలు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మంగళవారం ఉదయం సోలాపూర్‌లోని పండరీపూర్‌కు చేరుకొని అక్కడి విఠోభారుక్మిణి మందిర్‌లో కేసీఆర్, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తారు. సోలాపూర్‌కు చెందిన ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. మంగళవారం సాయంత్రం కేసీఆర్ హైదరాబాద్ తిరుగుపయణం అవుతారు. ఈ క్రమంలో దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం నేరుగా రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్‌కు వస్తారు.

Telangana Congress: రాహుల్‌తో జూపల్లి, పొంగులేటి భేటీకి సమయం ఫిక్స్.. రేవంత్ సహా ముఖ్యనేతలకు అధిష్టానం పిలుపు

బీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించిన తరువాత దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ దృష్టిసారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రపై సీఎం ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలోని పలు పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు దఫాలుగా బహిరంగ సభల్లోసైతం సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ తరువాత మహారాష్ట్రలో పట్టు సాధించాలని భావిస్తున్న కేసీఆర్ ఆమేరకు ప్రయత్నాలను వేగవంతం చేశారు.

జూన్ 15న నాగపూర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలోనూ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. త్వరలో ఔరంగాబాద్, పుణెలోనూ పార్టీ కార్యాలయాలు ప్రారంభిస్తామని కేసీఆర్ చెప్పారు. మొత్తానికి, మహారాష్ట్రలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రభావాన్ని చూపడంతోపాటు, ఆ రాష్ట్రంలోఅసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన పార్టీగా బీఆర్ఎస్ ఎదిగేలా కేసీఆర్ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు