త్వరలో మంత్రివర్గ విస్తరణ.. స్పష్టం చేసిన మంత్రి.. హోం మంత్రిగా సీతక్క?

రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో..

తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు ఉంటాయని తెలిపారు. సీతక్కకు హోం మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు.

రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని తెలిపారు. రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతాయని చెప్పారు. 2018 ఎన్నికల ముందు ప్యారాషూట్ నేతలకు టిక్కెట్లు ఉండవని రాహుల్ గాంధీ చెప్పారని, అయితే, పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందని అన్నారు. తెలంగాణలో త్వరలోనే వైద్య శాఖలో ప్రక్షాళన, సంస్కరణలు ఉంటాయని చెప్పారు. వైద్య శాఖలో రెండే విభాగాలు ఉండాలని, ఒకటి అడ్మినిస్ట్రేషన్, రెండు ఎడ్యుకేషన్ అని తెలిపారు.

మరోవైపు, టీపీసీసీ చీఫ్‌ నియామకం కూడా త్వరలోనే జరగనుంది. టీపీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. అధికార పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు అనే అంశం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌ హాట్‌ చర్చకు తావిస్తోంది.

ఈ విషయంలో ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా కొనసాగుతున్న సీఎం రేవంత్ మాత్రం.. అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ అంతా పూర్తిగా హైకమాండ్‌ పరిధిలోని అంశమని .. ఎవర్ని నియమించినా తమకు సమ్మతమేనని అంటున్నారు. అటు అధిష్ఠానం కూడా తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఎవరైతే బాగుంటుంది..? ఎవరికి ఇస్తే.. పార్టీ మరింత బలపడటంతో పాటు.. నేతలను కలుపుకొని ముందుకు వెళ్లగలరు..? అనే అంశంలో సమాచారం సేకరిస్తూ కసరత్తు చేస్తోంది.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి అందుకే ఢిల్లీలో పర్యటించారు: బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు