సీఎం రేవంత్ రెడ్డి అందుకే ఢిల్లీలో పర్యటించారు: బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి

గతంలో కోకాపేట భూములు అమ్మకానికి పెట్టారని ధర్నాలు చేశారని..

సీఎం రేవంత్ రెడ్డి అందుకే ఢిల్లీలో పర్యటించారు: బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy

తెలంగాణ ప్రభుత్వంపై బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో చేసింది ఏంటని నిలదీశారు. హైదరాబాద్‌లో వేల కోట్ల రూపాయల విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు పైరవీలు చేశారని ఆరోపించారు. ఓ ఏజెన్సీ ద్వారా బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు ప్రయత్నలు చేస్తున్నారని చెప్పారు.

ఓ కార్పొరేషన్ పెట్టి, దాని ద్వారా భూములు తాకట్టు పెట్టి, మళ్లీ భూములను అమ్మి డబ్బులు కడుతామని చెబుతున్నారని అన్నారు. గతంలో కోకాపేట భూములు అమ్మకానికి పెట్టారని ధర్నాలు చేశారని, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనేంటని ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం పరిధి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Also Read: అందుకే జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారారు: కేటీఆర్

రాబోయే రోజుల్లో తెలంగాణలో రెండు భయంకర కొత్త చట్టాలు రాబోతున్నాయని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి గుట్టు చప్పుడు కాకుండా భూములు తాకట్టు పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. ముందే అప్పులు చేసి ఖర్చులు చేస్తే మరి జీతాలు, పెన్షన్లు ఎలా చెల్లిస్తారని నిలదీశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలా ఉందని తెలిసికూడా ఎందుకు హామీలు ఇచ్చారని ప్రశ్నించారు.

Also Read: ఢిల్లీ హైకోర్టులో కవితకు దక్కని ఊరట