TGRTC : టీజీఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. పోస్టుల వివరాలు ఇవే..

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

TGRTC Job Notification : తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త రక్తంతో ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. మహాలక్ష్మీ పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని, ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా పోస్టులను భర్తీచేస్తామని మంత్రి తెలిపారు.

Also Read : అలాంటి వారి సినిమాలకు టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి వార్నింగ్

పోస్టుల వివరాలు ఇలా..
మొత్తం 3,035 ఉద్యోగాలు.
డ్రైవర్ ఉద్యోగాలు : 2000
శ్రామిక్ ఉద్యోగాలు : 743
డిపో మేనేజర్లు/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్లు : 25
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ – 15
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) : 84
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) : 114
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) : 23
సెక్షన్ ఇంజినీర్ (సివిల్) : 11
అకౌంట్స్ ఆఫీసర్ : 6
మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) : 7
మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్ట్) : 7

ట్రెండింగ్ వార్తలు