Hyderabad : హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. నగరంలో అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక బస్సులు.. ఈ ఫోర్ డేస్ మాత్రమే.. రూట్లు, టైమింగ్స్ ఇలా..
Hyderabad : హైదరాబాద్ నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలను దర్శించుకోవాలనుకునే వారికి టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
Hyderabad temple tour buses
Hyderabad : హైదరాబాద్ నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలను దర్శించుకోవాలనుకునే వారికి శుభవార్త. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది.’టెంపుల్స్ దర్శన్ టూర్’ పేరుతో భక్తుల సౌకర్యార్థం గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
Also Read : Dasara Festival 2026 : దసరా రోజున విజయ ముహూర్తం ఎప్పుడు..? ఆ సమయంలో ఇలాచేస్తే అద్భుత ఫలితాలు
జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాల దర్శనార్థం ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
ఈనెల 17, 18, 19, 20 తేదీల్లో నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉంటాయని, భక్తులు ఈ సౌకర్యాన్ని సద్విని యోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. ఈ ప్రత్యేక బస్సులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గంటకు ఒకటి చొప్పున నడుస్తాయి.
రూట్లు ఇవే..
♦ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బల్కంపేట, పెద్దమ్మగుడి, చార్మినార్, మహంకాళి దేవాలయం వరకు ఒక రూట్.
♦ అఫ్టల్ంజ్ నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, పెద్దమ్మగుడి, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, మహంకాళి దేవాలయం వరకు రెండో రూట్గా ఎంపిక చేసి బస్సులు నడుపుతున్నారు.
బస్సుల వేళలు..
♦ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బల్కంపేట : ఉదయం 7 గంటలకు, 8.00, 9.00, 10.15, 11.15 గంటలకు, మధ్యాహ్నం 12.15, 1.40, 2.40, 3.40 గంటలకు
♦ అఫ్ఘల్గంజ్ నుంచి చార్మినార్ : ఉదయం 7.30, 8.30, 9.30, 11.00, మధ్యాహ్నం 12.00, 1, 2.30, 3.30, సాయంత్రం 4.30గంటలకు
♦ బల్కంపేట నుంచి పెద్దమ్మగుడి : ఉదయం 7.30, 8.30, 9.30, 10.45, 11.45, మధ్యాహ్నం 12.45, 2.10, 3.10, సాయంత్రం 4.10 గంటలకు.
♦ చార్మినార్ నుంచి పెద్దమ్మగుడి : ఉదయం 7.45, 8.45, 9.45, 11.15, 12.15, 115, మధ్యాహ్నం 2.45, 3.45, సాయంత్రం 4.45 గంటలకు
♦ పెద్దమ్మగుడి నుంచి చార్మినార్ : ఉదయం 8.15, 9.15, 10.15, 11.20, మధ్యాహ్నం 12.20, 1.20, 2.55, 3.55, సాయంత్రం 4.55 గంటలకు
♦ పెద్దమ్మగుడి నుంచి బల్కంపేట : ఉదయం 8.40, 9.40, 10.40, మధ్యాహ్నం 12.10, 1.10, 2.10, 3.50, సాయంత్రం 4.50, 5.50 గంటలకు.
♦ చార్మినార్ నుంచి మహంకాళి దేవాలయం : ఉదయం 9.10, 10.10, 11.10, మధ్యాహ్నం 12.25, 1.25, 2.25. సాయంత్రం 4.00. 5.00, 6 గంటలకు
♦ బల్కంపేట నుంచి మహంకాళిదేవాలయం : ఉదయం 9.25, 10.25, 11.25, మధ్యాహ్నం 12.55, 1.55, 2.55, సాయంత్రం 4.25. 5.25, 6.25గంటలకు
