Muralidhar Rao : దళిత బంధు పంపిణీలో అవినీతికి కేసీఆరే బాధ్యుడు : మురళీధర్ రావు

బీజేపీ ప్రజాస్వామ్య పాలన చేస్తుంటే.. తెలంగాణలో కుటుంబ, తప్పుల తడకతో పాలన సాగుతోందని ఆరోపించారు. పరీక్షలు జవాబుదారీతనం లేకుండా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

Muralidhar Rao

Dalita Bandhu Corruption : సంక్షేమ పథకాల్లో ఎలాంటి లీకేజ్ లేకుండా మోదీ పాలన సాగుతోందని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ చార్జి మురళీధర్ రావు అన్నారు. పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఇందుకు వ్యతిరేకంగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో హక్కుల కోసం పోరాడడానికి అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు.

బీజేపీ ప్రజాస్వామ్య పాలన చేస్తుంటే.. తెలంగాణలో కుటుంబ, తప్పుల తడకతో పాలన సాగుతోందని ఆరోపించారు. పరీక్షలు జవాబుదారీతనం లేకుండా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం స్కీం కింద 30వేల ఇల్లు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎన్నికల కోసమే హామీలను ఇస్తాడు.. ఎన్నికల అనంతరం ఆ పథకాలు అమలు చేయడు అని విమర్శించారు.

Foreign Gold : విదేశీ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు అరెస్టు

దళిత బంధు పంపిణీలో అవినీతికి కేసీఆరే బాధ్యుడని పేర్కొన్నారు. ధరణిని ల్యాండ్ లిటికేషన్ సెటిల్మెంట్ కోసమే తీసుకొచ్చారని ఆరోపించారు. సచివాలయాన్ని పవర్ మోనోపోలీ సెంటర్ గా మార్చారని వెల్లడించారు. సచివాలయాన్ని నిజాం ఫోర్టు లాగా మార్చారని ఎద్దేవా చేశారు. ఆర్టీఐ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఉద్యోగులకు కనీసం ఒకటో తేదీన జీతభత్యాలు ఇవ్వడం లేదని వెల్లడించారు.

ప్రతి పనికి ఎమ్మెల్యేలు, మంత్రులు రేట్ కార్డ్ కడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంస్థాగతమైన అవినీతి జరుగుతోందన్నారు. మిస్ గవర్నెన్స్ కు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. గత నాలుగు సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్న పోరాటాలు దేశంలో ఏ పార్టీ చేయలేదన్నారు. కేసీఆర్ టోపీ ధరిస్తూ ప్రజలకు టోపీ పెడుతున్నారని తెలిపారు.

Parthasarathy : వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు

తమ మధ్య విభేదాలు ప్రింటెడ్, విపక్షాల చేస్తున్న దుష్ప్రచారమేనని స్పష్టం చేశారు. తమది పూర్తిగా యునైటెడ్ లీడర్ షిప్ అని పేర్కొన్నారు. తమ పార్టీపై ఉద్దేశ్యపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు ఇప్పుడు ఓ అధ్యక్షుడు ఉన్నాడని.. ఆయన సూచనలతోనే తాము పని చేస్తున్నామని తెలిపారు.

యాంటీ బీఆర్ఎస్ గా బీజేపీ మాత్రమే నిలబడుతుందన్నారు. నాయకుల గ్రూప్ కారణంగా రాజకీయాలు శాసించబడవు అని తేల్చి చెప్పారు. ప్రజాభీష్టం మేరకే రాజకీయాలు సాగుతాయని తెలిపారు. బీజేపీకి ఇంపార్టెన్స్ పెరుగకుండా చేసేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు