Manikrao Thakre: ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై పూర్తి వివరాలు తెలిపిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్

రాష్ట్రంలోని ఓ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిందని, దాన్ని చూసి తాము..

Manikrao Thakre

Manikrao Thakre – TPCC: తెలంగాణ(Telangana)లో మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ కాంగ్రెస్ పార్టీ (Congress) తమ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే దీనిపై పూర్తి వివరాలు తెలిపారు.

అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగుతోందని మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. రాష్ట్రంలోని ఓ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిందని, దాన్ని చూసి తాము కూడా తొందరగా ప్రకటించాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని, తాము ఒక పద్ధతి ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుందని మాణిక్‌రావు ఠాక్రే చెప్పారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని అన్నారు. అభ్యర్థుల ఎంపికలో సర్వేలు, సామాజిక సమీకరణాలు సహా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దశలవారీగా ఉంటుందని మాణిక్‌రావు ఠాక్రే అన్నారు. తమ అభ్యర్థుల విషయంలో ఇప్పటివరకు ఏ సీటుకూ అభ్యర్థి ఫైనల్ కాలేదని వివరించారు. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్ లో చేరుతుందా? అన్న విషయంపై తనకు వివరాలు తెలియవని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం

ట్రెండింగ్ వార్తలు