Maoists Movements in Telangana : తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు .. అప్రమత్తమైన పోలీసులు.. మావోల తలపై రివార్డు ప్రకటన

తెలంగాణలో మరోసారి మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోల ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని గిరిజనులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మావోల తలపై రివార్డు ప్రకటించారు.

Maoists Movements in Telangana : తెలంగాణ పరిసర ప్రాంతాలు ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా ఉండేవి. కూబింగ్, ఎన్ కౌంటర్లులు జరుగుతుండేవి. కానీ కొంతకాలంగా అటువంటి జాడలు లేవు. కానీ మరోసారి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మావోయిస్టుల అలజడి మొదలైంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల సానుభూతిపరులుగా గిరిజనులు మసలుతుంటారు. దీంతో పోలీసులు గిరిజనులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మావోల సమాచారం అందితే తమకు తెలియజేయాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో పోలీసులు మావోయిస్టుల తలపై రివార్డులు ప్రకటించారు. గతంలో పలు ఎన్ కౌంటర్లలో తప్పించుకున్న అడెల్లు దళం తెలంగాణలో సంచరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో మరోసారి పోలీసులు మావోల కదలికలపై డేకళ్లు వేశారు. ఏ చిన్న సమాచారం అందినా అలెర్ట్ అవుతున్నారు. వారం రోజులుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, గోదావరి పరివాహిక ప్రాంతాలతో పాటు అటవీ ప్రాంతాల్లో అడెల్లు దళం తిరుగుతున్నట్లుగా గుర్తించారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా డంప్ బయటపడింది. మహారాష్ట్ర సరిహద్దు కైలాష్ టెక్ది ప్రాంతంలో గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అడెళ్లు దళం సంచారం నేపథ్యంలో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడు పదార్థాలు లభ్యమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతంలోని గ్రామాలను జల్లెడ పడుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందనుకున్న తరుణంలో.. కొద్ది రోజులుగా అడవుల్లో సంచరిస్తూ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం.. దాడులు చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో.. జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ ప్రాంతంలో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా డంప్ బయటపడింది. మహారాష్ట్ర సరిహద్దు కైలాష్ టెక్ది ప్రాంతంలో గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అడెళ్లు దళం సంచారం నేపథ్యంలో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడు పదార్థాలు లభ్యమవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతంలోని గ్రామాలను జల్లెడ పడుతున్నారు. ఇదిలావుంటే.. ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్టు సమాచారం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందనుకున్న తరుణంలో.. కొద్ది రోజులుగా అడవుల్లో సంచరిస్తూ అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులు ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం.. దాడులు చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ అధికారుల హెచ్చరికలతో.. జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.

 

ట్రెండింగ్ వార్తలు