CI Nageswara Rao Case : సీఐ నాగేశ్వరరావు కేసులో కీలక ఆధారాలు సేకరణ

నాగేశ్వరరావు వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అనేక ఆరోపణలు రావడంతో గోప్యంగా విచారణ జరుపుతున్నారు. నాగేశ్వరరావు బాధితులంతా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.

CI Nageswara Rao Case : గన్ తో బెదిరించి వివాహితపై అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగేశ్వరరావు వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆయనపై అనేక ఆరోపణలు రావడంతో గోప్యంగా విచారణ జరుపుతున్నారు. నాగేశ్వరరావు బాధితులంతా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు పోలీసులు.

CI Nageswara Rao : ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న సీఐ నాగేశ్వరరావు అక్రమాలు

అటు, నాగేశ్వరరావుకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. నాగేశ్వరరావుని హయత్ నగర్ కోర్టుకి తరలించనున్నారు. వివాహితపై నాగేశ్వరరావు రేప్, కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అలాగే బెదిరింపులకు పాల్పడిన రివాల్వర్ ను కూడా ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచార ఘటనా స్థలం నుంచి ఇబ్రహీంపట్నం యాక్సిడెంట్ వరకు కీలక ఆధారాలు సేకరించారు. బాధితురాలికి ఇప్పటికే మెడికల్ టెస్టులు పూర్తి చేశారు. ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ లు కీలకం కానున్నాయి. ఐ విట్నెస్ ల స్టేట్ మెంట్లు కూడా రికార్డు చేశారు పోలీసులు.

CI Nageswara Rao : వివాహితపై అత్యాచారం కేసు.. కీచక ఖాకీపై సస్పెన్షన్ వేటు

తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహిళలకు భద్రత కల్పించాల్సిన స్టేషన్ ఆఫీసరే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడన్న ఆరోపణలు డిపార్ట్ మెంట్ లో కలకలం సృష్టించాయి. కిడ్నాప్, అత్యాచారం, ఆయుధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్ పల్లి ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావుపై వేటు పడింది.

పోలీస్ డ్రెస్ వేసుకున్నాం కదా అని ఏం చేసినా అడిగే వారు ఉండరనుకున్నాడో ఏమో బరితెగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు నాగేశ్వరరావు. న్యాయం కోసం తన పోలీస్ స్టేషన్ కు వచ్చిన వ్యక్తిని వేధించడమే కాకుండా అతడి భార్యపై అత్యాచారం చేసినట్లుగా నాగేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు