Telangana Power Consumption : తెలంగాణ చరిత్రలోనే రికార్డ్, అత్యధిక విద్యుత్ వినియోగం.. కారణం అదేనా?

తెలంగాణలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. ఇవా

Telangana Power Consumption : తెలంగాణలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. ఇవాళ (మార్చి 30) రాష్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం నమోదైంది. ఇవాళ ఉదయం 11 గంటల 01 నిమిషానికి 15వేల 497 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఈ సీజన్ లో ఇదే పీక్ డిమాండ్ అని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. సమ్మర్ సీజన్ కావడంతో ఈ వేసవిలో 16వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. విద్యుత్ వినియోగంలో ద‌క్షిణాదిన తెలంగాణ రెండో స్థానంలో ఉంది.

రాష్ట్రంలో రోజురోజుకీ విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరడానికి కారణాలు లేకపోలేదు. ఇది అసలే సమ్మర్. ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండవేడిమితో జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. చల్లదనం కోసం జనాుల పాట్లు పడుతున్నారు. ఫ్యాన్ లేకుండా సెకను కూడా ఉండలేకపోతున్నారు. ఇక ఏసీలు, కూలర్ల వినియోగమూ పెరిగింది. మరోవైపు సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పారిశ్రామిక(పరిశ్రమలకు) అవసరాలు పెరగడం.. విద్యుత్‌ డిమాండ్‌ పెరగడానికి కారణాలు.

Also Read..Telangana Power Demand : తెలంగాణ చరిత్రలోనే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం, ఒక్కరోజే..

రాష్ట్రంలో మొత్తం విద్యుత్‌ డిమాండ్‌లో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగించబడుతోందని అధికారులు తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక విద్యుత్‌ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు.

Electricity Demand : తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్

గతేడాది విషయానికి వస్తే.. మార్చిలో అత్యధికంగా 14వేల 160 మెగా వాట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది. గత డిసెంబర్‌లో ఈ రికార్డును అధిగమిస్తూ 14,750 మెగావాట్ల పీక్‌ విద్యుత్‌ వినియోగం జరిగింది. తాజాగా గురువారం 15,497 మెగావాట్ల విద్యుత్‌ వినియోగమైంది. మార్చి నెలలో 15వేల మెగా వాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదవుతుందని ముందే ఊహించామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

అందుకే సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యుత్‌ అంతరాయం లేకుండా సరఫరాకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇక, ఈ ఏడాది వేసవి కాలంలో 16వేల మెగా వాట్లకు పైగా విద్యుత్ డిమాండ్‌ ఏర్పడొచ్చని అంచనా వేశారు. ఎంత డిమాండ్‌ వచ్చినా కూడా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు