Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కదులుతున్న డొంక.. ఈడీ సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలు ..

పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావాదేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీలపైన శ్రీనివాస్ రావును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో దానికా అనే కోణంలో దర్యాప్తును ఈడీ కొనసాగిస్తోంది.

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై, గోరుంట్ల బుచ్చి బాబు (CA), అభినవ్ రెడ్డి, అభిషేక్ రావు, గండ్ర సృజన్ లను విచారించిన ఈడీ.. వీరు ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం అరుచోట్ల సోదాలు నిర్వహించింది. సుచిత్రా, కొండాపూర్ లోని రెండు నివాసాలలో, మాదాపూర్ వార్సన్ సాఫ్ట్ వేర్ సంస్థ, ఉప్పల్ లోని సాలిగ్రామ్ టెక్నాలజీలో ఈడీ సోదాలు నిర్వహించింది. బిల్డర్ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని సుమారు ఆరు గంటల పాటు ఈడీ అధికారులు విచారించి అతని స్టేట్ మెంట్ నమోదు చేసుకున్నారు. శ్రీనివాస్ రావు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంత మందినిసైతం విచారించేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు .. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో దాడులు

ఇదిలాఉంటే.. విచారణలో భాగంగా వెన్నమనెని శ్రీనివాస్‌రావు దగ్గర కీలక విషయాలు ఈడీ రాబట్టినట్లు తెలుస్తోంది. సాలిగ్రామ్ ఐటీ కంపెనీ, పవిత్ర పై ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వార్సన్ సన్ షోరూమ్,గోల్డ్ స్టార్ మైన్స్ అండ్ మిన‌రల్స్ కంపెనీ లపై ఈడీ సోదాలు చేసింది. లిక్కర్ స్కామ్ ముడుపులు ఈ కంపెనీల నుంచే వెళ్లినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. పిళ్లై , అభిషేక్ రావ్, గండ్ర ప్రేమ్ సాగర్, సృజన్ రెడ్డిలకు ఢిల్కీ లిక్కర్ స్కాంలో సంబంధాలపై ఈడీ లోతుగా ఆరా తీస్తుంది. ముఖ్యంగా జోనా ట్రావెల్స్ లో కీలక ఆధారాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కాంలో కార్యకలాపాలకోసం స్పెషల్ ఫ్లయిట్స్ బుక్ అయినట్టు, జోనా ట్రావెల్స్ నుంచి ఈ ఫ్లయిట్ వెళ్లినట్టు ఈడీ గుర్తించింది. జోనా ట్రావెల్స్ లో సోమవారం ఈడీ సోదాలు నిర్వహించింది. ప్రజా ప్రతినిధులు, మద్యం సిండికేట్లను ఫ్లయిట్‌లో వెళ్లేలా జోనా ట్రావెల్స్ ఏర్పాట్లు చేసినట్లు ఈడీ భావిస్తుంది. సిగ్నల్ యాప్ లో పిళ్ళై, శ్రీనివాస్ రావ్ మధ్య సంభాషణలు జరిగాయి. ఈ క్రమంలో శ్రీనివాస్ రావ్ ముందు పిళ్ళై చాట్ ప్రింట్ ను ఈడీ చూపించి ప్రశ్నించింది.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్.. తెలంగాణ రాజకీయ ప్రముఖలతో పిళ్లైకు సంబంధాలు

శ్రీనివాసరావుకు చెందిన పలు కంపెనీల నుండే ముడుపులు వెళ్లినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్యంగా తెరమీదకి శ్రీనివాసరావు పేరు వచ్చింది. సీఏ బుచ్చిబాబు ఇంట్లో సోదాల అనంతరమే శ్రీనివాసరావు పై ఈడీ ఫోకస్ పెట్టింది. దోమలగూడ లోని బుచ్చిబాబు నివాసంలో సుదీర్ఘంగా సోదాలు చేసిన ఈడీ.. బుచ్చిబాబు ఇంట్లో లభించిన హార్డ్ డిస్క్లో కీలక సమాచారం స్వాధీనం చేసుకుంది. శ్రీనివాసరావు ద్వారానే కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు ఈడీ సేకరించినట్లు సమాచారం. కంపెనీల ఏర్పాటుకు సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని, పలు ఒప్పంద పత్రాలను ఈడీ అధికారులు క్షుణంగా పరిశీలిస్తున్నారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ట్విస్ట్.. ఎమ్మెల్సీ కవిత ఫొటోపై రాజకీయ దుమారం

పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ పార్టీ నేతలకు 200 కోట్లు ఇచ్చినట్టు, శ్రీనివాస్ రావు ద్వారానే లావాదేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. 200 కోట్లు లావాదేవీలపైన శ్రీనివాస్ రావును ఈడీ ప్రశ్నించింది. లిక్కర్ టెండర్ల కోసం చెల్లించారా లేదా మరో దానికా అనే కోణంలో దర్యాప్తును ఈడీ కొనసాగిస్తోంది. టెండర్ల నుండి లైసెన్స్ వరకు రెండు వందల కోట్లు హైదరాబాద్ నుండి వెళ్లినట్టు గుర్తించిన ఈడీ, 18 జోన్‌లకు సంబంధించి తొమ్మిది లిక్కర్ కంపెనీలకు హైదరాబాద్ వ్యాపారవేత్తలకు లింకులు ఉన్నట్లు భావిస్తోంది. అయితే ఈ డబ్బు ఎవరి ఖాతాలో నుండి వెళ్లిందనే అంశం పై ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు