Telangana BJP: యోగి వస్తున్నారు..! ఖరారైన బీజేపీ ముఖ్యనేతల పర్యటనలు.. కేసీఆర్ పై పోటీగురించి విజయశాంతి సంచలన ట్వీట్

ఈనెల 20 నుంచి ప్రచారంలో పాల్గొనే బీజేపీ ముఖ్యనేతల జాబితాను ఆపార్టీ అధిష్టానం విడుదల చేసింది. వీరు పదిరోజుల్లో రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేయనున్నారు.

Yogi Adityanath

Telangana assembly elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజాక్షేత్రంలో సవాళ్లు విసురుకుంటున్నారు. అధికారంలోకి వచ్చేది మేమంటే మేమే అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో అధికారం మాదే అంటూ చెబుతున్న బీజేపీ ఆమేరకు వ్యూహాలకు పదునుపెడుతోంది. మరికొద్ది గంటల్లో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమవుతోంది. అభ్యర్థుల జాబితా ప్రకటించగానే ప్రజాక్షేత్రంలో ప్రచార జోరును పెంచేందుకు బీజేపీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కేంద్రంలోని పార్టీ పెద్దలతో పాటు ఇతర రాష్ట్రాల బీజేపీ సీఎంలను ప్రచారం రంగంలోకి దింపనుంది. ఈ క్రమంలో ఈనెల 20 నుంచి బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో ప్రచారంలో పాల్గోనున్నారు.

Read Also : BJP Telangana: అసెంబ్లీ బరిలోకి దిగమంటున్న బీజేపీ సీనియర్లు.. వారిద్దరికి మినహాయింపు!

ముఖ్యనేతల పర్యటనల తేదీలు ఇవే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ లు పాల్గోనున్నారు. ఈనెల 20 నుంచి ప్రచారంలో పాల్గొనే బీజేపీ ముఖ్యనేతల జాబితాను ఆపార్టీ అధిష్టానం విడుదల చేసింది. వీరు పదిరోజుల్లో రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేయనున్నారు. ఈనెల 20న కేంద్ర మంత్రి స్మృతి ఇరాని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు. 27న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 28న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, ఈనెల 31న యూపీ సీఎం ఆదిత్యనాథ్ లు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నారు.

Read Also : Jana Sena Party : ఈసారి వెనక్కి తగ్గొద్దు.. పవన్ కల్యాణ్ కు తెలంగాణ జనసేన నేతల విజ్ఞప్తి

గజ్వేల్ నుంచి బండి సంజయ్ పోటీ?
గజ్వేల్ నుంచి బండి సజయ్ పోటీ చేయాలనుకున్నారా? ప్రస్తుతం బీజేపీలో ఆసక్తికర చర్చ సాగుతుంది. తాజాగా బీజేపీ మహిళా నేత విజయశాంతి ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ బరిలో ఉన్నారు. కేసీఆర్ పై పోటీగా గజ్వేల్ నుంచి తాను బరిలోకి దిగుతానని ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, విజయశాంతి తన ట్విటర్ ఖాతాలో.. గజ్వేల్ లో బండి సంజయ్ పోటీ అంటూ పేర్కొనడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయశాంతి ట్వీట్ ప్రకారం.. బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదని కార్యకర్తల విశ్వాసం. అందుకు, గజ్వేల్ నుంచి బండి సంజయ్, కామారెడ్డి నుంచి నేను అసెంబ్లీకి సీఎం కేసీఆర్ పై పోటీ చేయాలని గత కొన్నిరోజులుగా మీడియా సమాచారం దృష్ట్యా కార్యకర్తలు అడగటం తప్పుకాదు. అసెంబ్లీ ఎన్నిల్లో పోటీ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ, వ్యూహాత్మక నిర్ణయాలు ఎలాఉన్నా.. పార్టీ నిర్దేశితమే అన్నది వాస్తవం అంటూ విజయశాంతి ట్వీట్ లో పేర్కొన్నారు. విజయశాంతి ట్వీట్ బీజేపీలో ఆసక్తికర చర్చకు దారితీసినట్లు తెలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు