Sexual Assault : హైదరాబాద్‌లో ఆగని అత్యాచార ఘటనలు..నగరంలో మరో రెండు దారుణాలు

రాజధానిలో మరో రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. ఓ మైనర్‌పై అత్యాచారం జరిగితే, మరో మైనర్‌పై సామూహిక అత్యాచారయత్నం జరిగింది. సుల్తాన్‌షాహీలో 12 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్‌ చేశాడు.

sexual assault : హైదరాబాద్‌లో కామాంధులు రెచ్చిపోతున్నారు. బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. జూబ్లీహిల్స్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై విపక్షాలు ఉద్యమించినా…కామాంధుల ఆగడాలు ఆగట్లేదు. రాజధానిలో మరో రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. ఓ మైనర్‌పై అత్యాచారం జరిగితే, మరో మైనర్‌పై సామూహిక అత్యాచారయత్నం జరిగింది. సుల్తాన్‌షాహీలో 12 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తానని నమ్మించి క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్‌ చేశాడు. డ్రైవర్, అతని స్నేహితుడు కలిసి ఆ బాలికను అత్యాచారం చేసేందుకు యత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అమ్మమ్మ ఇంట్లో నివాసముంటూ చదువుకుంటున్న ఆ బాలిక గత నెల 31న సాయంత్రం బాలిక తన తల్లిదండ్రులు నివాసముంటున్న షాహీన్‌నగర్‌కు బయల్దేరింది. పహాడీషరీఫ్‌ కమాన్‌ వద్ద ఒంటరిగా ఉన్న బాలికను షాహీన్‌నగర్‌ తీసుకెళ్తానంటూ 36 ఏళ్ల షేక్‌ కలీం అలీ కారు ఎక్కించుకున్నాడు. రాత్రి 11 గంటల వరకు క్యాబ్‌లో షాద్‌నగర్‌ వైపు తిప్పుతూ కొందుర్గ్‌లో డెయిరీ ఫాం నిర్వహిస్తున్న మహ్మద్‌ లుక్మాన్ ఇంటికి తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి అత్యాచారయత్నం చేశారు.

Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ కేసులో కీలక ఆధారాలు సేకరణ

బాధితురాలు కేకలు వేయడంతో భయపడ్డ క్యాబ్ డ్రైవర్…ఆ బాలికను కారు ఎక్కించుకుని మర్నాడు ఉదయం 5 గంటలకు సుల్తాన్‌షాహీలో వదిలేసి వెళ్లిపోయాడు. మొఘల్‌పురా పోలీసులు.. స్టేషన్‌ ఎదురుగా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తున్న బాలికను గుర్తించి భరోసా కేంద్రానికి తరలించడంతో అసలు విషయం వెలుగుచూసింది. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

చార్మినార్‌ ఏరియాలో బట్టల షాపులో పని చేస్తున్న ఓ బాలికను నమ్మించి లంగర్‌హౌస్‌కు చెందిన ఓ యువకుడు అఘాయిత్యం చేశాడు. ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల మహ్మద్‌ సూఫియాన్‌.. చార్మినార్‌ సమీపంలో బట్టల షాపులో పనిచేస్తున్న బాలికను పరిచయం చేసుకున్నాడు.

Jubilee Hills Girl Rape : జూబ్లీహిల్స్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ కేసులో కీలక ఆధారాలు సేకరణ

గత నెల 30న లంగర్‌హౌస్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి…బాలికపై అత్యాచారం చేశాడు. మర్నాడు ఆ బాలికను తీసుకెళ్లి షాపు వద్ద వదిలేశాడు. గత గురువారం తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను తల్లి నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. బాధిత బాలిక ఫిర్యాదుతో కాలాపత్తర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్రెండింగ్ వార్తలు