సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం : 10th Classకి బిట్ పేపర్ ఉండదు

  • Publish Date - May 20, 2020 / 06:22 AM IST

ఏపీలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కరోనా వేళ..ఇతర వాటిపై దృష్టి సారిస్తూ..కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా విద్యా వ్యవస్థపై దృష్టి సారించారు. నాడు – నేడు ప్రోగ్రాం కింద..ప్రభుత్వ స్కూళ్లల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారు. కానీ వైరస్ కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ సంవత్సరం నిర్వహించే పరీక్షల్లో (10వ తరగతి) బిట్ పేపర్ తొలగించింది. పబ్లిక్ పరీక్షలను సులభతరం చేసేలా చర్యలు తీసుకుంది. బిట్ పేపర్ తొలగిస్తామని ఇప్పటికే చెప్పింది కూడా. 2019-20 ప్రారంభంలో ఇంటర్నల్ మార్కులను బిట్ పేపర్ ను తొలగించింది. ప్రతి సబ్జెక్ట్ లోనూ…100 మార్కులకు ప్రశ్నలు ఉండేలా మార్పులు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా కరోనా వైరస్ కారణంగా 11 ప్రశ్నా పత్రాలను ఆరింటికి కుదించింది. ఇప్పటి వరకు పదో తరగతి విద్యార్థులు 11 ప్రశ్నా పత్రాలతోనే పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. ప్రశ్నల సంఖ్యను కాకుండా మార్కులను పెంచారు. 50 మార్కులు 100 అయ్యాయి. 

ట్రెండింగ్ వార్తలు