ఈసీ కీలక నిర్ణయం.. ఏపీలో ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు

ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగే ఎన్నికల్లో అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.

AP Assembly Elections 2024 : ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో జరిగే ఎన్నికల్లో అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. పోలింగ్ విధుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని కేటగిరిల వారికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12డి జారీ గడువును మే 1వ తేదీ వరకూ పొడిగిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : Lakshmi Narayana : నన్ను చంపేందుకు కుట్ర..! వాళ్ల బాస్‌కు శిక్ష పడేలా చేశానని నాపై కక్ష- సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

గతంలో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు. ఇప్పటి వరకు అంగన్ వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధుల్లొ పాల్గొనలేదు. ఈసారి ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలని, సిబ్బంది కొరత లేకుండా పూర్తిస్థాయిలో నియమించాలనే ఉద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఉన్న సిబ్బంది విధుల్లోకి తీసుకోవద్దని ఇప్పటికే జిల్లా అధికారులకు ఈసీ ఆదేశాలుజారీ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు