CM Jagan Election Campaign : రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు, సుడిగాలి పర్యటనలు.. సీఎం జగన్ రెండో విడత ఎన్నికల ప్రచారం

ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు జగన్.

CM Jagan Election Campaign : ఏపీ సీఎం జగన్ మరో ఎన్నికల యాత్రకు సిద్ధమవుతున్నారు. రేపటి(ఏప్రిల్ 28) నుంచి రెండో విడత ప్రచారం ప్రారంభిస్తారు. ఇప్పటికే మేమేంతా సిద్ధం బస్సు యాత్రతో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం జగన్. అంతకుముందు సిద్ధం పేరుతోనూ భారీ బహిరంగ సభల ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లారు.

ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు జగన్. రేపటి నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు జగన్. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు మూడు ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు.

28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు.. 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు.. 30న కొండపి, మైదుకూరు, పీలేరు.. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

Also Read : వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్.. కీలక అంశాలు ఇవే

 

ట్రెండింగ్ వార్తలు