YCP Manifesto 2024 : వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్.. కీలక అంశాలు ఇవే

వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టోను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.

YCP Manifesto 2024 : వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్.. కీలక అంశాలు ఇవే

YSRCP Manifesto

CM Jagan Released YCP Manifesto : వైఎస్ఆర్ సీపీ మ్యానిఫెస్టోను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందని అన్నారు. మ్యానిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావించామని అన్నారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారి దగ్గర మ్యానిఫెస్టో ఉందని, మ్యానిఫెస్టోను ప్రతీ ఇంటికి పంపించామని, ఓ ప్రొగ్రెస్ కార్డు మాదిరి ఏంఏం చేశామన్నది ప్రజలకు వివరించామని జగన్ చెప్పారు. కరోనా కాలంలోనూ మ్యానిఫెస్టో అమలు చేశామని, మ్యానిఫెస్టో అమలుకు కరోనా కాలంలో ఎలాంటి సాకులు చూపలేదని జగన్ అన్నారు. గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పామని అన్నారు. ఐదేళ్ల కాలంలో 99శాతం హామీలు అమలు చేశామని జగన్ చెప్పారు. రూ. 2లక్షల 70కోట్లను డీబీటీ ద్వారా అందించామని అన్నారు.

Also Read : ఈసీ కీలక నిర్ణయం.. ఏపీలో ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు

2014లో కూటమికి ఓటు వేసినందుకు ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. కూటమిగా ఏర్పడి ఇచ్చిన హామీలను అమలు చేశారా? రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలపై కూటమి ఇచ్చిన హామీలేమయ్యాయి? అని జగన్ ప్రశ్నించారు. సింగపూర్ ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.. ప్రతీ నగరంలోనూ హైటెక్ సిటీ కడతానంటూ అబద్ధాలు చెప్పారు. కనీసం ప్రత్యేక హోదా అంశాన్నికూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ చంద్రబాబు గతంలో వెటకారంగా మాట్లాడాడంటూ జగన్ గుర్తు చేశారు. చనిపోయిన తరువాత ప్రతి పేదవాడి గుండెల్లో, ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలని జగన్ అన్నారు.

Also Read : 10Tv Conclave : అవును.. అతడు నా మనిషే- సీఎం జగన్ దాడిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

సామాజిక న్యాయం అన్నదానికి అర్ధం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపిన పాలన ఐదేళ్ల కాలంలో జరిగిందని జగన్ అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు.. మ్యానిఫెస్టోలో పొందుపర్చని హామీలనుసైతం ఐదేళ్ల కాలంలో అమలు చేయడం జరిగిందని చెప్పారు. పిల్లలకు ట్యాబ్స్, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పిల్లలకు విద్యాకానుక, రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు పెంపు వంటి పథకాలు మ్యానిఫెస్టోలో లేవని, ఇలాంటివి అనేకం అమలు చేశామని జగన్ చెప్పారు. అబద్దాలతో చంద్రబాబుతో పోటీపడలేనని.. చేయగిలిగేవి మాత్రమే నేను చెబుతానని.. అవకాశం, వెసులుబాటు ఏమాత్రం ఉన్నా మ్యానిఫెస్టోలో లేనివికూడా అమలు చేస్తామని జగన్ చెప్పారు. ప్రతీ పేవాడి అభివృద్ధి కోసం జగన్ అడుగులు వేస్తాడని, ఆ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. పేదవాడికి మేలుచేసే విషయంలో జగన్ కంటే చంద్రాబుకు కాదుకదా.. మరెవరూ చేయలేరని చెప్పగలుగుతానని జగన్ అన్నారు.

Also Read : 10Tv Conclave : ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది- సీఎం జగన్ గాయంపై డా.సింహాద్రి చంద్రశేఖర్

  • మ్యానిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు..
    తొమ్మిది ముఖ్యమైన హామీలతో వైసీపీ మ్యానిఫెస్టో..
  • విద్య..
    అమ్మఒడి, ట్యాబ్ లు, విద్యా కానుక, గోరుమద్ద,ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన.
    వైద్యం..
    ఆరోగ్య శ్రీ విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లీనిక్ లు, ఫ్యామిలీ డాక్టర్, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష.
    వ్యవసాయం..
    రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల భీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9గంటల విద్యుత్, సమయానికే ఇన్ ఫుట్ సబ్సిడీ.
    ఉన్నత విద్య ..
    జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరింయంటెడ్ కర్కియంలో మార్పులు.
    నాడు – నేడు..
    నాడు – నేడు స్కూళ్లు, ఆస్పత్రులు
    పేదలందరికీ ఇళ్లు..
    అక్కచెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు, ఇళ్లు.
    మహిళా సాధికారత..
    చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ
    సామాజిక భద్రత..
    పెన్షన్ కానుక, రెండు విడతల్లో 3,500కు పెంపు. ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ.
    అభివృద్ధి ..
    మౌలిక వసతులు, సుపరిపాలన.

 

  • రెండు విడతల్లో పెన్షన్ రూ.3,500 దాకా పెంపు.
  •  వైఎస్ఆర్ చేయూత రూ.75వేల నుంచి రూ. 1.50లక్షలకు పెంపు.
  • వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.60వేల నుంచి రూ.1.20లక్షలకు పెంపు.
  • వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం రూ. 45వేల నుంచి రూ.1.5లక్షలకు పెంపు.
  • అమ్మఒడి రూ.15వేల నుంచి 17వేలకు పెంపు.. తల్లుల చేతికి రూ.15వేలు అందజేత.
  • వైద్య, ఆరోగ్య శ్రీ విస్తరణ
  • వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద రూ. 3లక్షల రుణం.
  • వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కొనసాగింపు.
  • అర్హులైన ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగింపు.
  • ఆటోలకు ట్యాక్సీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ. ఆటోలకు, ట్యాక్సీలకు వచ్చే ఐదేళ్లలో రూ.50వేలు.
  • మత్స్యకార భరోసా ఐదు విడతల్లో రూ. 50 వేలు చెల్లింపు.
  • వాహన మిత్రను ఐదేళ్లలో రూ. 50వేల నుంచి రూ. లక్ష కు పెంపు.
  • లారీ డ్రైవర్లకుకూడా ఇకపై వాహన మిత్ర అమలు. లారీ డ్రైవర్లకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా.
  • చేనేతలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున, ఐదేళ్లలో రూ.1.20లక్షలు.
  • ప్రతి నియోజకవర్గంలో స్కిల్ హబ్.
  • జిల్లాకో స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీ.
  • తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ.
  • స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పనిచేస్తున్న గిగా సెక్టార్ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్ఆర్ బీమా వర్తింపు.