10Tv Conclave : ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది- సీఎం జగన్ గాయంపై డా.సింహాద్రి చంద్రశేఖర్

ఈ ఎన్నికల్లో వైసీపీదే హవా అని ఆయన జోస్యం చెప్పారు. సీఎం జగన్ తో తనకు మంచి అనుబంధం ఉందని తెలిపారు.

10Tv Conclave : ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది- సీఎం జగన్ గాయంపై డా.సింహాద్రి చంద్రశేఖర్

Dr Simhadri Chandrasekhar In 10TV Conclave

Updated On : April 26, 2024 / 9:59 PM IST

10Tv Conclave : విజయవాడ హోటల్‌ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో ప్రముఖ డాక్టర్, మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ పలు అంశాలపై మాట్లాడారు. సీఎం జగన్ గాయం, ప్రభుత్వ ఆసుపత్రల్లో వైద్య సేవలు, ఏపీ రాజకీయాలు, ఏపీ ఎన్నికలు.. ఇలా తదితర అంశాలపై డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ తన అభిప్రాయాలను వెల్లడించారు.

సీఎం జగన్ గాయంపై స్పందించిన ఆయన.. జగన్ కు జరిగింది పెద్ద ప్రమాదం అని అన్నారు. జగన్ కు దెబ్బ తగిలిన తర్వాత వెంటనే ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారని, దాంతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీదే హవా అని ఆయన జోస్యం చెప్పారు.

”మా ఏరియాకు మూడు సమస్యలు ఉన్నాయి. తాగునీరు, సాగునీరు, మురుగునీరు సమస్య ఉంది. ఈ మూడు సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ దాని కోసం చాలా కష్టపడుతున్నారు. నీటి సమస్య, పక్కా ఇళ్ల కోసం పోరాటం చేస్తున్నారు” అని సింహాద్రి చంద్రశేఖర్ తెలిపారు.

Also Read : దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది- తెలకపల్లి రవి కీలక వ్యాఖ్యలు