10Tv Conclave : అవును.. అతడు నా మనిషే- సీఎం జగన్ దాడిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

నన్ను ఇరికించడం కోసం, నా ద్వారా లోకేశ్, చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కోసం దుర్గారావుని ఈ కేసులో తీసుకెళ్లారు.

10Tv Conclave : అవును.. అతడు నా మనిషే- సీఎం జగన్ దాడిపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

10Tv Conclave : సీఎం జగన్ పై రాయి దాడి కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరిగిందని టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమ ఆరోపించారు. తన ద్వారా చంద్రబాబు, లోకేశ్ ను ఇబ్బంది పెట్టాలని చూశారని ఆయన అన్నారు. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో అరెస్ట్ అయిన వేముల సతీశ్.. వేముల దుర్గారావు ఇద్దరూ వేర్వేరు అని ఆయన తేల్చి చెప్పారు. జగన్ పై దాడి ఘటనతో వేముల దుర్గారావుకి ఎలాంటి సంబంధం లేదని బోండా ఉమ స్పష్టం చేశారు. అవును.. వేముల దుర్గారావు నా మనిషే అని బోండా ఉమ అన్నారు.

”వేముల దుర్గారావు.. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి. మా పార్టీ ఆఫీసు పక్క రోడ్డులోనే ఉంటాడు. నిత్యం పార్టీ ఆఫీసు దగ్గరే కూర్చుంటాడు. అది వాస్తవం. రాయి వేశాడని పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి వేముల సతీశ్. అదే కమ్యూనిటీ, అదే ప్రాంతంలో ఉంటాడు. వేముల అనేది ఒకటే పేరు. ఇద్దరి మధ్య బంధుత్వం ఉందో లేదో తెలియదు కానీ, అతడికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.

వేముల దుర్గారావు బోండా ఉమ మనిషి. అందులో ఎలాంటి సందేహం లేదు. బోండా ఉమ మనిషి, పార్టీ బీసీ సెల్ సెక్రటరీ. అతడికి, జగన్ పై దాడి ఘటనకు సంబంధం లేదు. నన్ను ఇరికించడం కోసం, నా ద్వారా లోకేశ్, చంద్రబాబును ఇబ్బంది పెట్టడం కోసం దుర్గారావుని ఈ కేసులో తీసుకెళ్లారు. కేసు ఒప్పుకోవాలని 5 రోజుల పాటు టార్చర్ పెట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అతడి భార్యను, వాళ్ల బంధువులను కూడా ఇబ్బంది పెట్టారు. నేను ఏ తప్పు చేయనప్పుడు ఒప్పుకునే ప్రసక్తే లేదని దుర్గారావు చెప్పాడు. నేను రాయి దాడి చేసి ఉంటే అక్కడే ఎందుకు ఉండేవాడిని దుర్గారావు చెప్పాడు. మాకు వేముల సతీశ్ కు ఎలాంటి సంబంధం లేదు. అప్పుడూ అదే మాట చెప్పాను, ఇప్పుడూ అదే మాట చెబుతున్నాను” అని బోండా ఉమ అన్నారు.

విజయవాడ హోటల్‌ ఐలాపురంలో నిర్వహించిన ‘10టీవీ కాన్‌క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’లో విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమ పాల్గొన్నారు. ఏపీ రాజకీయాలు, ఎన్నికలు, వైసీపీ ప్రభుత్వ పాలన, అప్పులు, అభివృద్ధి, కూటమి గెలుపు అవకాశాలు, సీఎం జగన్ పై దాడి ఘటన, వేముల దుర్గారావు.. ఇలా తదితర అంశాలపై బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : ఏపీ రాజధాని అదే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు- పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు