బోండా ఉమపై మూడు ఫిర్యాదులు చేశాం: వెలంపల్లి శ్రీనివాసరావు

Velampalli Srinivasa Rao: పార్టీ ఆఫీస్‌లో ఆయన ఎలా నివాసముంటున్నారని ప్రశ్నించారు.

టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయవాడలో వెలంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. బోండా ఉమపై మూడు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రెసిడెన్షియల్‌లోనే ఓట్లు ఉండాలని, కానీ సింగ్ నగర్ పార్టీ ఆఫీస్‌లో ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. తమ ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకోలేదని తెలిపారు. 2014లో దాఖలు చేసిన అఫిడవిట్లో తూర్పు నియోజకవర్గంలో ఇంటి అడ్రస్ పెట్టారని, 2019లో కూడా అదే ఇంటి అడ్రస్ నే పెట్టారని వివరించారు.

ఇప్పుడేమో సింగ్ నగర్ పార్టీ ఆఫీస్ ను ఇల్లుగా చూపించారని ఆరోపించారు. ఆ భవనం ప్లాన్ దరఖాస్తు చేసుకున్నప్పుడే టీడీపీ ఆఫీస్ పేరుతో అనుమతులు తీసుకున్నారని చెప్పారు. పార్టీ ఆఫీస్లో ఆయన ఎలా నివాసముంటున్నారని ప్రశ్నించారు.

ఆఫీస్‌లో ఓట్లు ఎలా నమోదు చేస్తారని చెప్పారు. గతంలో వైసీపీ నేతల ఓట్లను బోండా బలవంతంగా రద్దు చేయించారని అన్నారు. మరి ఇప్పుడు అదే నిబంధన బోండాకు ఎందుకు వర్తించదని నిలదీశారు.

Also Read: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు

ట్రెండింగ్ వార్తలు