వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు

Yanamala Krishnudu: తుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు.

yanamala krishnudu

ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్ క్యాంప్‌ కార్యాలయంలో ఆయన సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్‌ నేత యనమల కృష్ణుడు. అలాగే, టీడీపీ నేతలు పి.శేషగిరి రావు, పి.హరికృష్ణ, ఎల్‌.భాస్కర్‌ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

తుని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. కాగా, యనమల కృష్ణుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు. కృష్ణుడు కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. యనమల సోదరుల మధ్య విభేదాల కారణంగా కృష్ణుడు వైసీపీని వీడారు.

ఎన్నికల వేళ యనమల కృష్ణుడు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అప్పట్లో దాడిశెట్టి రాజాపై తుని నుంచి కృష్ణుడు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు కృష్ణుడు. ఈసారి తుని టికెట్‌ను యనమల రామకృష్ణుడు కూతురికి టీడీపీ కేటాయించింది. యనమల కృష్ణుడు అసంతృప్తిగా ఉన్నారు.

Also Read: హరీశ్ రావు పక్కా డ్రామా మాస్టర్.. కేసీఆర్ ప్రమేయం లేకుండానే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా..? : కడియం శ్రీహరి