ఆగస్టు నుంచి గ్రామాల పర్యటన, సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీ సీఎం జగన్ గ్రామాల బాట పట్టనున్నారు. గ్రామాల పర్యటనకు రెడీ అయ్యారు. ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటించనున్నారు సీఎం

  • Publish Date - June 11, 2020 / 12:55 PM IST

ఏపీ సీఎం జగన్ గ్రామాల బాట పట్టనున్నారు. గ్రామాల పర్యటనకు రెడీ అయ్యారు. ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటించనున్నారు సీఎం

ఏపీ సీఎం జగన్ గ్రామాల బాట పట్టనున్నారు. గ్రామాల పర్యటనకు రెడీ అయ్యారు. ఆగస్టు నుంచి గ్రామాల్లో పర్యటించనున్నారు సీఎం జగన్. గురువారం(జూన్ 11,2020) గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలపై సీఎం జగన్ సమీక్షించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలని అధికారులతో సీఎం అన్నారు. పారదర్శకత, అవినీతి, వివక్షత లేకుండా చూడాలన్నారు. ప్రకటించిన సమయంలోగా పథకాలు అందేలా చూడాలని అధికారులతో చెప్పారు. సరైన కారణం లేకుండా ఎవరి దరఖాస్తులను కూడా తిరస్కరించకూడదని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారికి పథకాలు అందకపోతే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని సీఎం తేల్చి చెప్పారు. పథకాలు అందలేదని ఎవరి దగ్గరి నుంచి ఫిర్యాదు రాకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు