IPL 2024 : కోల్‌కతాపై ముంబై జట్టు ఓటమికి అసలు కారణం అదేనా.. హార్దిక్ పాండ్యా ఏమన్నారంటే?

కేకేఆర్ జట్టుపై ఓటమితో ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్ కు దూరమైంది. ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన ముంబై జట్టు కేవలం మూడు మ్యాచ్ లలోనే విజయం సాధించింది.

IPL 2024 KKR vs MI : ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా శుక్రవారం రాత్రి  ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది. 170 పరుగుల లక్ష్యంగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టుకు ఆరంభం నుంచే కలిసిరాలేదు. కేకేఆర్ జట్టు బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ముంబై బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించారు. సూర్యకుమార్ యాదవ్ (56) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా పరుగులు రాబట్టలేక పోయారు. దీంతో ముంబై జట్టు 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ జట్టు ఓటమికి గల కారణాలను వెల్లడించారు.

Also Read : IPL 2024 : ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా రోహిత్ శర్మ.. సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యాపై నెటిజన్ల ఆగ్రహం

టీ20 మ్యాచ్ లలో భాగస్వామ్యాలు నెలకొల్పకపోతే నష్టమే. మా జట్టు ఓటమికి అదే ప్రధాన కారణం. బ్యాటింగ్ సమయంలో మేము సరైన భాగస్వామ్యాన్ని నిర్మించలేక పోయాం. మా బ్యాటర్లు త్వరగా పెవిలియన్ బాటపట్టారు. తొలి ఇన్నింగ్స్ తరువాత పిచ్ కాస్త బౌలర్లకు పూర్తి అనుకూలంగా మారింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు బౌలింగ్ లో రాణించారు. మా జట్టు బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. చివరిలో కేకేఆర్ జట్టు బ్యాటర్లను పరుగులు చేయకుండా నిలువరించడంలో విజయవంతం అయ్యారు. కానీ, బ్యాటింగ్ విభాగంలో సరియైన భాగస్వామ్యం నెలకొల్పడంలో విఫలం అయ్యాం అని హార్దిక్ చెప్పారు.

Also Read : Suresh Raina : టీమ్ఇండియా మాజీ క్రికెట‌ర్ సురేశ్ రైనా ఇంట్లో తీవ్ర విషాదం..

కేకేఆర్ జట్టుపై ఓటమితో ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్ కు దూరమైంది. ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన ముంబై జట్టు కేవలం మూడు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరు పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు కోల్ కతా జట్టు ముంబై పై విజయంతో ప్లే ఆఫ్ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. కేకేఆర్ జట్టు మొత్తం 10 మ్యాచ్ లు ఆడగా.. ఏడు మ్యాచ్ లలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ జట్టు దాదాపు ప్లేఆఫ్ కు చేరిందనే చెప్పొచ్చు.

 

 

ట్రెండింగ్ వార్తలు