Airtel New Mobile Plan : ఎయిర్‌టెల్ కొత్త మొబైల్ ప్లాన్ ఇదిగో.. ఫ్రీగా నెట్‌ఫిక్స్ చూడొచ్చు.. రోజుకు డేటా ఎంతంటే?

Airtel Mobile Plan : ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం అన్‌లిమిటెడ్ 5జీ డేటా, ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ అందించే కొత్త మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Airtel launches new mobile plan with free Netflix and 3GB daily data

Airtel New Mobile Plan : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కొత్త మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ 5G డేటాను కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రస్తుతం ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తోంది. ఈ అద్భుతమైన ప్లాన్‌తో ఓటీటీ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. వేగవంతమైన ఇంటర్నెట్ కోరుకునే కస్టమర్ల కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కొత్త ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

టెలికాం టాక్ ప్రకారం.. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితాలో రూ. 1499 ఆఫర్‌తో కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌కు సంబంధించి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన లేదు. టెలికాం ఆపరేటర్ సైలంట్‌గా వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో చూపించే ప్లాన్ల జాబితాలో చేర్చింది. ఎయిర్‌టెల్ రూ. 1499 ప్రీపెయిడ్ ప్లాన్‌లోని అన్ని ఆఫర్‌లను వివరంగా ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Jio AirFiber vs Airtel AirFiber : ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌కు పోటీగా జియో ఎయిర్‌ఫైబర్.. రెండింటి మధ్య ఇంటర్నెట్ స్పీడ్, ధర ఎంత? బెనిఫిట్స్ ఏంటి?

ఎయిర్‌టెల్ రూ. 1499 ప్లాన్ వివరాలు :

ఎయిర్‌టెల్ లేటెస్ట్ రూ. 1,499 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రోజువారీ 3GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. ఈ ప్లాన్ గడువు 84 రోజులు మాత్రమే. ఈ ప్లాన్‌లో కాంప్లిమెంటరీ కింద నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ 5G డేటా యాక్సెస్ చేయొచ్చు. అపోలో 24/7 సర్కిల్ మెంబర్‌షిప్, ఫ్రీ హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్‌తో సహా అనేక సప్లిమెంటరీ పెర్క్‌లు ఉన్నాయి. భారత మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధర రూ. 199గా అందిస్తోంది. అయితే, ఎయిర్‌టెల్ అదనపు సబ్‌స్క్రిప్షన్ ఖర్చును తగ్గించుకునేలా వినియోగదారుల కోసం ఒక కాంప్లిమెంటరీ డీల్‌గా అందిస్తోంది.

ఈ మొబైల్ ప్లాన్ యాక్టివేషన్ ఇలా :
మీ కాంప్లిమెంటరీ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందడానికి ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు అన్‌లిమిటెడ్5G డేటా బెనిఫిట్స్ మాదిరిగానే యాక్సస్ చేయొచ్చు అందుకు ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మీ ఎయిర్‌టెల్ యాప్‌లోని ‘డిస్కవర్ థాంక్స్ బెనిఫిట్స్’ సెక్షన్‌కు నావిగేట్ చేయండి. అక్కడ మీరు నెట్‌ఫ్లిక్స్ బెనిఫిట్స్ చూడవచ్చు. మీ మొబైల్ నంబర్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేయడానికి, ‘Claim’ బటన్‌పై ట్యాప్ చేయండి. ఆపై సాధారణ ‘ప్రొసీడ్’ బటన్‌పై ట్యాప్ చేయండి. ముఖ్యంగా, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం 84 రోజుల వ్యవధి వరకు వర్తిస్తుంది. ఎయిర్‌టెల్ పాలసీ ప్రకారం.. ప్రీపెయిడ్ కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ అర్హత గల రీఛార్జ్‌లో ఉన్నంత వరకు రీఛార్జ్ వ్యాలిడిటీ ప్రకారం అనేక బెనిఫిట్స్ పొందవచ్చు.

Airtel new mobile plan

జియో నుంచి రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే :
మరోవైపు.. ఎయిర్‌టెల్ టెలికం పోటీదారు రిలయన్స్ జియో కూడా రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, మొబైల్, బిగ్ స్క్రీన్ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. రూ. 1,099 ప్లాన్ మొబైల్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5జీబీ డేటా, 2జీబీ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. పెద్ద స్క్రీన్ వ్యూ కోసం కస్టమర్లు 84 రోజుల వ్యాలిడిటీతో రూ. 1,499 ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే, 5జీ సపోర్టెడ్ డివైజ్‌లలో అన్‌లిమిటెడ్ 5G ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ లింక్ చేయకపోతే ఛార్జీలు :
రెండు ప్లాన్‌లలో ప్రాథమిక నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ అకౌంట్లు ఉన్న వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ యాక్టివేషన్ ప్రక్రియలో లింక్ చేయవచ్చు. అకౌంట్ లింక్ చేసేవరకు, వినియోగదారులు వారి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌కు విడిగా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లు మొబైల్ డివైజ్‌ల్లో జియో సెట్-టాప్ బాక్స్, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి పెద్ద స్క్రీన్‌లలో అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

Read Also : Airtel CEO Gopal Vittal : ఎయిర్‌టెల్ యూజర్లు సాధారణ సిమ్‌కు బదులుగా ఇ-సిమ్ కార్డులు తీసుకోండి.. ఎందుకంటే?

ట్రెండింగ్ వార్తలు