Apple iPhone 16 Series : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. ఎయిర్ ప్యాడ్స్, ఆపిల్ వాచ్ కూడా..!

Apple iPhone 16 Series : ఐఫోన్ 16 సిరీస్, కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లను వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 20న జరిగే కార్యక్రమంలో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

iPhone 16 Series to Launch on September 10 Alongside New AirPods, Apple Watch Models

Apple iPhone 16 Series : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. కుపెర్టినో కంపెనీ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్‌ లాంచ్ సెప్టెంబర్ 10వ తేదీగా నిర్ణయించింది.

ఏడాది క్రితం ఆవిష్కరించిన ఐఫోన్ 15 లైనప్‌కు ఇది అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ లాంచ్ ఈవెంట్‌లో ఆపిల్ కొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ మోడల్‌లను కూడా ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఈ ఏడాదిలో ఆపిల్ ప్రో మోడల్‌లు భారీ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. అయితే, కంపెనీ హ్యాండ్‌సెట్‌లను డెడికేటెడ్ ‘క్యాప్చర్’ బటన్‌తో తీసుకురానుంది.

Read Also : iPhone 15 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ డీల్ ఎలా పొందాలంటే?

ఐఫోన్ 16 సిరీస్, కొత్త ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్‌లను వచ్చే నెలలో లాంచ్ చేయనుంది. నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 20న జరిగే కార్యక్రమంలో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఈ ఏడాదిలో 4 మోడళ్లను లాంచ్ చేసే అవకాశం ఉందని మునుపటి నివేదికలు సూచించాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 20న ఈ ఫోన్లు విక్రయానికి రానున్నాయి.

ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను వేగంగా ఫొటోలను క్యాప్చర్ చేసే క్యాప్చర్ బటన్‌తో రానుందని సూచిస్తుంది. అయితే, ఖరీదైన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్‌లు అప్‌గ్రేడ్ చేసిన అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, డిస్‌ప్లేలు 0.2తో అమర్చి ఉంటాయి. గత మోడల్ కన్నా పెద్దవి, భారీ బ్యాటరీలతో ఉండనున్నాయి.

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మాత్రమే ఈ ఏడాది చివరిలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టుతో అప్‌గ్రేడ్ అవుతుందని భావిస్తున్నారు. ఐఫోన్ 16 లైనప్‌లోని 4 మోడళ్లు ఆపిల్ కొత్త ఆన్-డివైస్ ఏఐ టెక్నాలజీకి రీబ్రాండెడ్ వెర్షన్ సపోర్టు అందిస్తాయి. ఈ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌ల అమ్మకాలను భారీగా పెంచుతాయని భావిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. కొత్త ఎయిర్‌పాడ్‌లు, ఆపిల్ వాచ్ మోడల్‌లు కూడా ఆపిల్ నెక్స్ట్ ఈవెంట్‌లో ఆవిష్కరించనుందని భావిస్తున్నారు.

కంపెనీ రియల్ వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్‌లు బడ్జెట్, మిడ్‌రేంజ్ ఎంపికలో రావచ్చు. రెండోది హై-ఎండ్ ఎయిర్‌పాడ్స్ ప్రో (2వ జనరేషన్) మోడల్ మాదిరిగానే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు సపోర్టు అందిస్తుంది. వచ్చే నెలలో అప్‌గ్రేడ్ అందుకోనుంది. మరోవైపు, ఇటీవలి నివేదికల ప్రకారం.. ఆపిల్ వాచ్ సిరీస్ 10 పెద్ద స్క్రీన్‌తో వస్తుంది. గత మోడల్‌ల కన్నా సన్నని మెటల్ బాడీ కలిగి ఉంటుంది.

Read Also : Infinix Note 40 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ రేసింగ్ ఎడిషన్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు