Rice Cultivation : ఖరీఫ్ వరి సాగులో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడులు

Rice Cultivation : ఖరీఫ్ వరిసాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు దీర్ఘకాలిక రకాల నాట్లను పూర్తి చేశారు . మరికొన్ని ప్రాంతాల్లో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు.

Rice Cultivation

Rice Cultivation : రుతుపవనాలు సమయానికే పలకరించినా.. తరువాత ముఖం చాటేశాయి. అయితే ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు . వరి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే ప్రాంతానికి, రకాలకు అనుగుణంగా సిఫారసు చేసిన ఎరువుల యాజమాన్యాన్ని రైతులు తప్పనిసరిగా పాటించాలి.  వరిసాగులో ఏ సమయంలో ఏ ఎరువులను వేసుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్.

Read Also : Agri Tips : అంతరపంటలతో అధిక లాభాలు పొందుతున్న మాలి గిరిజనులు

ఖరీఫ్ వరిసాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు దీర్ఘకాలిక రకాల నాట్లను పూర్తి చేశారు . మరికొన్ని ప్రాంతాల్లో మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో నారుమడి దశనుండి నాట్లు వేసే దశలో ఉన్నాయి.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వరిపైర్లు వివిధ దశలో ఉన్నాయి. అయితే ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలుకు చాలా వరకు వరినారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి.

ముఖ్యంగా నాట్లు మొదలు.. దశనుబట్టి  సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ.. తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లోని వరిపైరులో సూక్ష్మధాతు లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇవి ఏర్పడితే.. పైరు ఎదుగుదల లోపిస్తుంది.

దీన్ని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. రైతులు యూరియాను అధిక మోతాదులో వేస్తుంటారు. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులను సమపాళ్లలో వేసుంటే, పెట్టుబడులు తగ్గడమే కాకుండా, చీడపీడల బెదడ ఉండదు. తద్వారా అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుంది.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

ట్రెండింగ్ వార్తలు