ISRO Success Journey : అంతరిక్ష దినోత్సవం.. జయహో ఇస్రా.. ఆకాశమే హద్దుగా ప్రయాణం..!

ISRO Success Journey : అంతరిక్ష పరిశోధనల్లో ఆరు దశాబ్దాలకు ముందు పరిస్థితి వేరు. అమెరికా, రష్యా, చైనా ఇలా అగ్ర దేశాలు మాత్రమే చంద్రుని వంక చూడగలిగే ధైర్యం చేశాయి. కానీ భారత్‌ అచంచలమైన దీక్షతో.. అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది.

Special Focus on ISRO Success Journey

ISRO Success Journey : బిందువు.. బిందువు.. కలిస్తే సింధువవుతుంది.. ఒక్కో అడుగు ముందుకేస్తే ఎంత దూరమైనా చేరువవుతుంది. విశ్వ రహస్యాలను ఛేదించాలంటే అంతరిక్షమే హద్దవుతుంది. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం.. వైఫల్యాలనుంచి పాఠాలు నేర్చుకుంటేనే ఘన విజయాలు సొంతమవుతాయి.  భారత అంతరిక్షరంగంలో ఇస్రో ఆరుదశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం కూడా అలాంటిదే. అపజయానికి కుంగిపోలేదు.. విజయానికి పొంగిపోనూలేదు.. ఆకాశమే హద్దుగా.. ఇస్రో విజయయాత్ర అలా ముందుకు సాగుతూ ఉంది.

Read Also : ISRO Success Journey : ఇండియా చరిత్ర సృష్టించిన రోజు.. ఇస్రో చంద్రయాన్‌-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్!

అంతరిక్ష పరిశోధనల్లో ఆరు దశాబ్దాలకు ముందు పరిస్థితి వేరు. అమెరికా, రష్యా, చైనా ఇలా అగ్ర దేశాలు మాత్రమే చంద్రుని వంక చూడగలిగే ధైర్యం చేశాయి. కానీ భారత్‌ అచంచలమైన దీక్షతో .. దేశంలో అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. రాకెట్‌ అంటే తెలీని స్థాయి నుంచి ఇప్పుడు చంద్రున్ని తాకిన క్షణం వరకూ   ఎన్నో ఒడిదుడుకుల్ని ఇస్రో స్పేస్‌ జర్నీలో ఫేస్‌ చేసింది.   ఒక్కొక్కటిగా పరికరాలు సమకూర్చుకుంటూ…1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్‌ను స్థాపించుకున్నాం.

ఇతర దేశాలతో కలిసి అంతరిక్ష పరిశోధనలు చేయడం ప్రారంభించాం. 1963లో నాసా భారత్‌కు ఓ రాకెట్ అందించింది. దాన్ని నవంబరు 21న తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి ప్రయోగించాం.  ఆతర్వాత  రష్యా,  ఫ్రాన్స్ రాకెట్లను ప్రయోగించాం. 1969లో ఇస్రోగా రూపాంతరం చెందాక..విక్రమ్ సారాభాయ్, తర్వాతి కాలంలో సతీశ్‌ధావన్ , అబ్దుల్‌ కలాం అంతరిక్ష పరిశోధనల్లో కీలకపాత్ర పోషించారు. మన శాస్త్రవేత్తలు తొలిగా రూపొందించిన ఉపగ్రహం ఆర్యభట్ట.

దీన్ని  సోవియట్ యూనియన్ నుంచి 1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు. భారత్ విజయవంతంగా ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట. రోహిణి ఉపగ్రహాన్ని  శ్రీహరికోటనుంచి 1980లో SLV-3 ద్వారా ప్రయోగించారు.  1972 నుంచి 1984 మధ్య ఇస్రో ఎంతగానో అభివృద్ధి చెందింది. తొలి ఉపగ్రహం తయారీ, స్వదేశం నుంచి సొంత ఉపగ్రహం ప్రయోగం, లాంచింగ్ వెహికల్ అభివృద్ధి చేసుకోవడం వంటిఘనతలెన్నో సాధించింది.

ముందు  40 కిలోలు ఉండే  చిన్న ఉపగ్రహాలతో SLV-3 అభివృద్ధి చేసుకుంది ఇస్రో . తర్వాత 150 కిలోలు, తర్వాత వెయ్యికిలోల సామర్థ్యం గల పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్‌ను రూపొందించింది. 1993లో తొలి ప్రయోగం విఫలం. అయినా వెనకడుగు వేయలేదు. 2017లో ఒకేసారి 104 ఉపగ్రహాలు ప్రయోగించి రికార్డు సృష్టించింది. చంద్రయాన్‌, మంగళయాన్‌ ప్రయోగాలకు పీఎస్‌ఎల్వీ రాకెట్లను వినియోగిస్తూ వచ్చాం.

భూ పరిశీలనకు జీఎస్‌ఎల్వీ.. చిన్న శాటిలైట్ల కోసం  ఎస్‌ఎస్‌ఎల్వీలను ప్రయోగిస్తూ  ఇతర దేశాలకు కూడా సాంకేతిక సహకారం అందించే స్థాయికి ఎదిగాం. ఇప్పుడు చంద్రయాన్‌-3తో ఇస్రో కీర్తి విశ్వానికి తెలిసింది. ఆదిత్య ఎల్ 1 విజయం, గగన్‌యాన్‌  సన్నాహాలతో ఆకాశమే హద్దుగా సాగుతోంది ఇస్రో జర్నీ. ఆ ప్రయోగ ప్రయాణాలకు మూలం చంద్రయాన్‌3 ఇచ్చిన ఉత్సాహం. అందుకే ఈ అంతరిక్ష దినోత్సవం.

Read Also : ISRO Success Journey : ఇండియా చరిత్ర సృష్టించిన రోజు.. ఇస్రో చంద్రయాన్‌-3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్!

ట్రెండింగ్ వార్తలు