Crops Barren Lands : బంజరు భూముల్లో.. బంగారం పండిస్తున్న గిరిజనులు

Crops Barren Lands : ఈ పొలాలే గతంలో రాళ్లు, రప్పలతో నిండి అక్కడక్కడ  ఉండి లేని మొక్కలతో దర్శనమిచ్చేవి. సంప్రదాయ పంటలనే నమ్ముకున్న ఇక్కడ రైతులు రాగులు, సజ్జ, పచ్చజొన్న, స్థానికంగా దొరికే వేరుశనగ రకాల పంటలను సాగు చేసేవారు.

Crops Barren Lands

Crops Barren Lands : ఆ ప్రాంతం కరువుకు నిలువెత్తు నిదర్శనం. అడుగంటిన నీటి జాడ.. బీడు భూముల్లో రాతి గుట్టలు.. పశువుల మేతకు మాత్రమే పనికొచ్చే పడావు భూములు. భారతీయ నూనెగింజల పరిశోధనా స్థానం చేయూతతో.. చేయీ చేయీ కలిపి, కలసికట్టుగా కదిలిన రైతులు ఇప్పుడు బంగారు పంటలను పండిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు.. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడ.. ఏఏ పంటలు పండిస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గిరిజన గ్రామాన్ని చూడండీ.. వికారబాద్ నుండి తాండూరుకు వెళ్లే మార్గమధ్యలో ఉంది. ఇక్కడ దాదాపు 300 గిరిజన కుటుంబాలు ఉంటాయి. వీరి జీవనమంతా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. గతంలో ప్రతి ఇంటిలో పదుల నుండి వందల వరకు గోవులు ఉండేవి.

Read Also : Cotton Crop : పత్తి పంటలో కలుపు నివారణ.. పత్తిలో ఆగిన పెరుగుదల

అయితే, సంప్రదాయ పంటలు పండించడం.. అవికూడా సరిగ్గా పండక పోవడం.. పశువుల మేపు కష్టంగా మారడంతో క్రమంగా పశుసంతతి  అంతరించిపోయింది. జీవనోపాధికోసం దగ్గరలోని పట్టణాలకు పనులకు వెళ్ళే వారు. అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం భారతీయ నూనెగింజల పరిశోధనా స్థానం ఈ గ్రామాన్ని దత్తతకు తీసుకోవడంతో.. పంటల సరళి మార్చుకున్నారు.. దీంతో వీరి జీవన స్థితిగతులు మేరుగయ్యాయి.

ఈ పొలాలే గతంలో రాళ్లు, రప్పలతో నిండి అక్కడక్కడ  ఉండి లేని మొక్కలతో దర్శనమిచ్చేవి. సంప్రదాయ పంటలనే నమ్ముకున్న ఇక్కడ రైతులు రాగులు, సజ్జ, పచ్చజొన్న, స్థానికంగా దొరికే వేరుశనగ రకాల పంటలను సాగు చేసేవారు. ఈ భూములన్ని ఇసుకతో కూడుకున్న ఏటవాలు నేలలు కావడం.. వర్షాలు వస్తే పంటలు కొట్టుకపోయి.. ఇసుకమేటలు వేసేది. దీంతో శ్రమ, పెట్టుబడి వృధా అయ్యేది. రాను రాను స్థాని అయితే పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు తలెత్తేవి.

వ్యవసాయంలో రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులు తీసుకొచ్చింది.  ఇందులో భాగంగానే అయితే 2016 లో ఐసిఏఆర్, భారతీయ నూనెగింజల పరిశోధనా స్థానం ఫార్మర్స్ ఫస్ట్ ప్రోగ్రాం కింద వికారబాద్ జిల్లా, ధరూర్ మండలం, రాంపూర్ తండాను ఎంచుకొని వారి పంటల సాగులో మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఇక్కడి రైతు అధిక దిగుబడులను సాధిస్తూ.. మంచి ఆదాయం పొందుతున్నారు.

బీడు భూముల్లో బోర్లు వేసి ఆరుతడి పంటల సాగు వైపు దృష్టి సారించారు. రైతులందరు ఇప్పుడు ఈ భూముల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ లో ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ వారు రూపొందించిన వశిష్ట వేరుశనగ రకాన్ని ప్రతి రైతు కొంత మొత్తంలో సాగుచేస్తున్నారు. విత్తనాన్ని అభివృద్ధి చేసుకొని రబీలో ప్రధాన పంటగా వేయనున్నారు. మిగితా దిగుబడిని విత్తనంగా అమ్ముకొని అధిక ఆదాయం పొందేందుకు సిద్ధమవుతున్నారు. మూసపద్ధతిలో సంప్రదాయంగా పంటలు పండిస్తే.. నష్టాలు తప్పా.. లాభాలు రావు.

అందుకే మారుతున్న కాలానుగుణంగా.. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకొని శాస్త్రీయంగా పండిస్తేనే… మంచి దిగుబడి.. మార్కెట్ లో కూడా అధిక ధర వస్తుంది. అయితే సాగు పద్ధతులు, పంటల వివరాలు మారుమూల పల్లెల్లో ఉండే రైతులకు అంతగా తెలియవు. అందుకే వ్యవసాయలో ఆర్థిక అభివృద్ధిని మెరుగు పరిచేందకు భారతీయ నూనెగింజల పరిశోధన స్థానం ఒక పైలెట్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చింది.

ఇందులో భాగంగానే ధారూరు మండలంలోని రాంపూర్, గురుదొడ్ల, అంపల్లి, గట్టెపల్లి గ్రామాలను దత్తతకు తీసుకొని వారి వ్యవసాయ పద్ధతులు మార్చింది. పంట సరళిని మార్చి సాగుచేయిస్తుంది. తద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేలా చేయడమే కాకుండా.. వారికి ఆర్ఘిక ఆర్థిక భరోసాకు భాటలు వేస్తుంది. సంప్రదాయ పంటలకు విరామం ప్రకటించి మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలు పండించాలన్న ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది రాంపూర్ తండా గిరిజన రైతులు.

Read Also : Rice Cultivation : ఖరీఫ్ వరి సాగులో ఎరువుల యాజమాన్యం.. అధిక దిగుబడులు

ట్రెండింగ్ వార్తలు