Cotton Crop : పత్తి పంటలో కలుపు నివారణ.. పత్తిలో ఆగిన పెరుగుదల

Cotton Crop : వ్యవసాయ పనులకు సైతం ఆటంకం కలుగుతోంది. కలుపు తీయడం వంటి పనులు చేయలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది నాలుగున్నర నుండి ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.

Cotton Crop : పత్తి పంటలో కలుపు నివారణ.. పత్తిలో ఆగిన పెరుగుదల

Weed Control in Cotton Crop

Updated On : August 24, 2024 / 2:18 PM IST

Cotton Crop : నిన్నమొన్నటి వరకు వర్షాల కోసం ఎదురుచూసిన ఆదిలాబాద్ రైతులకు ఇప్పుడు ముసురు టెన్షన్ పట్టుకుంది. పత్తి విత్తనాలు విత్తుకున్న మొదట్లో వర్షాలు లేక ఇబ్బంది పడ్డ అన్నదాతకు.. ఇటీవల కురుస్తున్న ముసురు పత్తి పంటకు తీవ్ర ఆటంకంగా మారింది. కలుపు విపరీతంగా పెరిగడంతో అదనపు భారం అవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Sesame Crop Cultivation : నువ్వులో పెరిగిన తెగుళ్ల ఉధృతి – నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్యం

ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురు పత్తి రైతులను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. పత్తి పంటకు ధీటుగా కలుపు పెరుగుతుండటంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే చాలా చోట్ల పత్తి చేలల్లో నీరు నిలిచి మొక్కలు వాడిపోతున్నాయి. విడవని ముసురు కారణంగా మొక్కల ఎదుగుదల లోపించింది.

వ్యవసాయ పనులకు సైతం ఆటంకం కలుగుతోంది. కలుపు తీయడం వంటి పనులు చేయలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది నాలుగున్నర నుండి ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. అయితే పత్తిపంట ఆశాజనకంగా ఉన్నప్పటికీ ముసురు వాన అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తోంది.

పత్తి సాగులో ఇప్పటి వరకు రైతులు ఒక ఎకరాకు 5 నుండి 6 వేల వరకు ఖర్చు చేశారు. ముసురు వల్ల పంటలో ఏపుగా పెరిగిన కలుపును తొలగించేందుకు అదనంగా మరో మూడు నాలుగు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అయితే కూలీల సమస్య వేదింస్తోంది. మరోవైపు ఈ వర్షాలకు చీడపీడల బెడద కూడా ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి.  ప్రస్తుతం కలుపు, పురుగులను అరికట్టేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్.

Read Also : Turmeric Crop : వరుసగా కురిసిన వర్షాలకు పసుపులో దుంపకుళ్లు ఉధృతి.. నివారణ చర్యలు