తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుమిల్లి

తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ(TFI)లో 24 క్రాఫ్టులకు చెందిన ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుమల్లి ఎన్నికయ్యారు.

తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ(TFI)లో 24 క్రాఫ్టులకు చెందిన ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుమిల్లి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన కార్యదర్శి ఎన్నికల్లో అమ్మిరాజు 35 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇంతకుముందు ఈ పోస్ట్‌లో దొరై ఉండేవారు. ఇటీవల జరిగిన మేనేజర్స్ ఎన్నికల్లో దొరై ఓడిపోయారు. నిబంధనల ప్రకారం ఆయన ఫెడరేషన్ పోస్ట్‌కు అనర్హుడు కావడంతో ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నిక అనివార్యం అయింది.

కాగా, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా వెళ్లంకి శ్రీనివాస్, వెంకట్ కృష్ణ కూడా పోటీచేయగా అమ్మిరాజు 35 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఫెడరేషన్ ప్రెసిడెంట్‌గా అనిల్ వల్లభనేని, కార్యదర్శిగా అమ్మిరాజు, కోశాధికారిగా సురేష్ ఉన్నారు.

Also Read: ‘ఖుషి 2’ పై హీరోయిన్ ప్రియాంక మోహన్ కీల‌క వ్యాఖ్య‌లు.. స్పందించిన‌ ఎస్‌జే సూర్య..

ఈ సందర్భంగా ప్రెసిడెంట్ అనిల్ మాట్లాడుతూ.. ”24 శాఖలకు చెందిన ఫెడరేషన్‌లో ప్రధాన కార్యదర్శి ఎన్నిక అనివార్యం అయింది. అమ్మిరాజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి 24 క్రాఫ్ట్ కీలకం. కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామ”ని అన్నారు. తనను కార్యదర్శిగా ఎన్నుకున్న సభ్యులకు అమ్మిరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఫిలిమ్ ఇండస్ట్రీ కార్మికులకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు