TOXIC : బోల్డ్ సీన్స్.. బోలెడంత రచ్చ..!
యశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టాక్సిక్ (TOXIC) మూవీ టీజర్ ఇప్పుడు మాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపుతోంది.
KGF Hero Yash TOXIC teaser Scenes Issue
TOXIC : కేజీఎఫ్-2 తర్వాత కన్నడ స్టార్ యశ్ చేస్తున్న సినిమా టాక్సిక్. ఈ మూవీ మార్చి 19న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే ఇటీవల యశ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టాక్సిక్ మూవీ టీజర్ ఇప్పుడు మాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. అసలు ఈ సినిమా రిలీజ్ చేయొద్దంటూ డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఇంతలా ఈ మూవీ టీజర్ కాంట్రవర్సీ అవడానికి కారణం ఒక్కటే.. అభ్యంతరకర సీన్స్ ఉండటమే. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ టాక్సిక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌లో యశ్ ఎంట్రీని గ్రాండ్‌గా చూపిస్తూ లేడీస్‌ను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న సీన్లు పెట్టడంతో హీరో కన్న డైరెక్టర్ గీతుమోహన్ దాసే అందరికీ టార్గెట్ అయిపోయారు.
కేవలం టీజర్‌కే ఇంత కాంట్రవర్సీ అవుతుంటే ఇక సినిమా ఎలా ఉంటుందోనన్న చర్చ మొదలైంది. మమ్ముట్టి ఫ్యాన్స్ అయితే మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్‌ను ట్రోల్స్ చేస్తూ లేడీ అయి ఉండి ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. యశ్ రీఎంట్రీ సినిమాగా టాక్సిక్ మూవీ ఆడియన్స్ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తే..చాలా మంది మాలీవుడ్ ప్రముఖులు మాత్రం గీతు మోహన్‌దాస్‌పై ఫైర్ అవుతున్నారు.
టీజర్ చూసే సినిమాను నిలిపివేయాలన్న డిమాండ్లు వినిపిస్తుంటే.. ఇక సెన్సార్ దగ్గరికి వెళ్తే పరిస్థితి ఏంటన్న టాక్ నడుస్తుంది. కాంట్రవర్సీ అవుతుండటంతో అభ్యంతరకర సీన్లు తీసేస్తారా.? లేక ఎన్ని విమర్శలు వచ్చినా అలాగే కంటిన్యూ చేసి సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాలి.
