రాయుడి గారి తాలుకా ఐటెం సాంగ్ వచ్చింది.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ చేతుల మీదుగా..
శ్రీనివాస్ ఉలిశెట్టి, సత్య ఈషా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాయుడి గారి తాలుకా’. ఉలిశెట్టి మూవీస్ బ్యానర్‌పై కొర్రపాటి నవీన్ శ్రీ దర్శకత్వంలో నిత్యశ్రీ, పునర్వికా వేద శ్రీ, నవీన్ శ్రీ, పీజే దేవి, కరణం పేరినాయుడు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి స్పెషల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సినిమాల డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ చేతులు మీదగా ‘జాతరొచ్చింది..’ అని సాగే పాటను విడుదల చేసారు. ఈ మాస్ బీట్ పాటను గురుబిల్లి జగదీష్ రాయగా నగేష్ గౌరీష్ సంగీత దర్శకత్వంలో జయశ్రీ పల్లెఓ పాడారు. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
