Srinivasa Mangapuram : మ‌హేష్ అన్న కొడుకు హీరోగా ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) నుంచి జ‌య‌కృష్ణ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

Srinivasa Mangapuram : మ‌హేష్ అన్న కొడుకు హీరోగా ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

Ghattamaneni Jayakrishna first look out from Srinivasa Mangapuram

Updated On : January 10, 2026 / 11:12 AM IST
  • శ్రీనివాస మంగాపురం నుంచి జ‌య‌కృష్ణ ఫ‌స్ట్ లుక్‌
  • విడుద‌ల చేసిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు

Srinivasa Mangapuram : సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న దివంగ‌త రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ చిత్రానికి RX 100, మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని క‌థానియికగా న‌టిస్తోంది.

తాజాగా ఈ చిత్రం నుంచి జయకృష్ణ ఫ‌స్ట్ లుక్‌ను హీరో మ‌హేష్ బాబు చేతుల మీదుగా విడుద‌ల చేశారు.  బైక్ పై వెలుతూ కాస్త వంగి తుపాకీతో కాలుస్తున్న‌ట్లుగా ఉన్న జ‌య‌కృష్ణ లుక్ అదిరిపోయింది. ప్ర‌స్తుతం ఈ పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

లవ్ అండ్ మిస్ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. చంద‌మామ క‌థ‌లు బ్యాన‌ర్‌పై పి. కిర‌ణ్ నిర్మిస్తుండగా అశ్వ‌నీద‌త్ స‌మ‌ర్పిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నారు.