‘ఖుషి 2’ పై హీరోయిన్ ప్రియాంక మోహన్ కీలక వ్యాఖ్యలు.. స్పందించిన ఎస్‌జే సూర్య..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో `ఖుషి` మూవీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది.

Priyanka Mohan speech in Saripodhaa Sanivaaram Pre Release Event
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో `ఖుషి` మూవీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అప్పట్లో ఓ సెన్‌సేషన్. ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ చిత్రానికి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించారు. కాగా.. ఈ మూవీకి సీక్వెల్ చేస్తే బాగుంటుందని పవన్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక మోహన్ సైతం ఈ మూవీ సీక్వెల్‌కు సంబంధించిన ప్రస్తావన తెచ్చింది.
శనివారం నాని హీరోగా నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయిక. ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
Suhas : యంగ్ హీరో సుహాస్ డేరింగ్ స్టెప్!
ఈ కార్యక్రమంలో హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. అందరి తరుపున ఎస్ జే సూర్యను తాను ఓ ప్రశ్న అడుగుతున్నానని చెప్పారు. మేం ఖుషి 2 సినిమాని ఆశించవచ్చా.. ఖుషి 2 చేస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కల్యాణ్‌తోనే చేయాలని కోరింది. దీనిపై స్పందించాలని కోరింది.
ఎస్ జే సూర్య మాత్రం నవ్వి ఊరుకున్నారు. ఎలాంటి అప్‌డేట్ అయితే ఇవ్వలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.