Suhas : యంగ్ హీరో సుహాస్ డేరింగ్ స్టెప్!
వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు నటుడు సుహాస్.

Suhas acquires US rights to Janaka Aithe Ganaka
Suhas – Janaka Aithe Ganaka : వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు నటుడు సుహాస్. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షిత లు నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూరైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే.. ఈ మూవీ ఫైనల్ వైర్షన్‌ను చూసిన తరువాత సుహాస్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. యూఎస్‌లో ఈ చిత్రాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఈ మూవీ యూఎస్ఏ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
Pawan Kalyan : సినిమాలు పూర్తి చేయడంపై పెదవి విప్పని పవర్‌స్టార్
ఇటీవల జరిగిన మూవీ ప్రమోషన్ ఈవెంట్‌లో సుహాస్ మాట్లాడుతూ.. ఫైనల్ వెర్షన్ చూశానని, తనకు చాలా బాగా నచ్చిందని చెప్పాడు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశాడు. ఇందులో మధ్యతరగతి వ్యక్తి నటించినట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు హాయిగా నవ్వుకుంటారని అన్నాడు. దిల్‌రాజు సపోర్ట్ ను మరువలేనన్నాడు.
సంకీర్తన విపిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయ్ బుల్గనిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, గోపరాజు రమణ లు కీలక పాత్రలను పోషించారు.