Pawan Kalyan : సినిమాలు పూర్తి చేయడంపై పెదవి విప్పని పవర్‌స్టార్
Pawan Kalyan : ఈ పరిస్థితుల్లో షూటింగ్ మధ్యలో నిలిచిన మూడు సినిమాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ గతవారం పవర్‌స్టార్‌ను కలిసిన నిర్మాతలకు ఆయన నుంచి సరైన రెస్సాన్స్ లభించలేదని టాక్ వినిపిస్తోంది.

Gossip Garage
Pawan Kalyan : రాజకీయాల్లో బిజీగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నెక్ట్స్ మూవీ ఎప్పుడు? ఏపీ ఎన్నికలకు ముందు మూడు సినిమా షెడ్యూల్స్‌తో బిజీబిజీగా గడిపిన పవర్‌స్టార్… ఇప్పుడు పొలిటికల్ యాక్టవిటీస్‌తో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు… తన సమయమంతా ఏపీ ప్రభుత్వ విధులకే కేటాయిస్తుండటం వల్ల…. ఆయన చేస్తున్న మూడు సినిమాలపై అనేక సందేహాలు మొదలయ్యాయి… సినిమాలు రీస్టార్ట్ చేయాలని నిర్మాతలు ఒత్తిడి చేస్తుంటే… పవర్‌స్టార్ నో చెప్పేస్తున్నారట… అంటే ఇక సినిమాలకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టిసినట్లేనా?.
Read Also : Dream Home : ప్రాపర్టీ షోపై మక్కువ చూపుతున్న హైదరాబాదీలు
ఏపీ పాలిటిక్స్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సినీ కెరీర్‌కు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టేసినట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది క్రితం ఆయన నటించిన బ్రో సినిమా రిలీజ్ అవ్వగా, ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఐతే గత ఏడాది జూలైలో బ్రో సినిమా రిలీజ్ అయ్యాక ఏపీ ఎన్నికల దృష్ట్యా మిగిలిన సినిమాల షూటింగ్‌కు విరామం ప్రకటించారు పవన్‌కల్యాణ్. ఇక ఎన్నికల తర్వాత హాండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్‌తో గెలిచిన పవన్… డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
అప్పటి నుంచి ప్రభుత్వ పనుల్లో బిజీగా ఉండటంతో ఆయన నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీర మల్లు షూటింగ్‌లు ఆగిపోయాయి. ఈ మూడింట్లో ఏది ముందు షూటింగ్ పూర్తి చేస్తే.. అది రిలీజ్ అవుతుందని ఇన్నాళ్లు భావించగా, ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ మొదలయ్యే పరిస్థితి లేకపోవడమే అభిమానులను నిరుత్సాహపరుస్తుందంటున్నారు. అదే సమయంలో నిర్మాతలు కూడా ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో షూటింగ్ మధ్యలో నిలిచిన మూడు సినిమాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ గతవారం పవర్‌స్టార్‌ను కలిసిన నిర్మాతలకు ఆయన నుంచి సరైన రెస్సాన్స్ లభించలేదని టాక్ వినిపిస్తోంది. తమ సినిమాల షూటింగ్ కోసం ముగ్గురు నిర్మాతలు వేర్వేరుగా పవన్‌ను కలిసినా, మళ్లీ సినిమాలు చేసే అంశంపై పవన్ మాత్రం వారికి ఏదీ స్పష్టంగా చెప్పలేదని అంటున్నారు.
షూటింగ్స్ మధ్యలో ఆగిపోవటంతో బడ్జెట్ పెరిగిపోతోందని, ఇప్పటికే వేసిన సెట్స్ పాడైపోతున్నట్లు నిర్మాతలు పవర్‌స్టార్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. అయితే అధికారిక పనుల వల్ల పవన్ ఇప్పట్లో షూటింగ్స్‌కి వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. అదేసమయంలో తనకు సినిమాల కంటే దేశం, సమాజం, రైతు హితం ముఖ్యమంటూ పవర్‌స్టార్ చేసిన కామెంట్స్ కూడా తన నిర్మాతలను ఉద్దేశించి చేసినవే అన్న టాక్ వినిపిస్తోంది. దీంతో పవర్‌స్టార్ కొత్త సినిమా రిలీజ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పవర్‌స్టార్‌గా అభిమానుల హృదయాలను దోచుకున్న పవన్… రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆయన మంచి సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ, ప్రజా జీవితంపై ఆసక్తి పెంచుకుంటున్న పవన్… సినీ రంగానికి కొద్ది రోజులు విరామం ఇవ్వాలని నిర్ణయించడమే హాట్‌టాపిక్‌గా మారింది.
అయితే ఈ విరామం ఎన్నాళ్లు… పవన్ సినీ కెరీర్ మళ్లీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నది మాత్రం అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కెరీర్‌పై ఇటు నిర్మాతలు, అటు మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు ఏమీ చెప్పలేకపోతున్నారు. దీంతో పవర్‌స్టార్ సినీ కెరీర్‌తోపాటు ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహర వీర మల్లు సినిమాలపై సస్పెన్స్ కొనసాగుతోంది.
Read Also : Dream Home : ముచ్చర్లలో కలల నగరం.. మరో సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్!