Saripodhaa Sanivaaram : ‘సరిపోదా శనివారం’ సెన్సార్ కంప్లీట్.. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చిందంటే..?
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ 'సరిపోదా శనివారం'.

Nani Saripodhaa Sanivaaram censor complete
Saripodhaa Sanivaaram : నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరిలు నిర్మిస్తున్నారు. ఆగస్టు 29న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఇక ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ గురించి హీరో నాని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు. ఇందులో నాని సినిమా రన్ టైం 2 గంటల 35 నిమిషాలు అని చెప్పగా.. వెనక నుంచి ఎస్‌జే సూర్య వచ్చి ప్లస్ 15 మినిట్స్ అని అన్నాడు. అంటే మొత్తం సినిమా రన్‌టైం 2 గంటల 50 నిమిషాలు.
Stree 2 : బాక్సాఫీస్ వద్ద స్త్రీ 2 కలెక్షన్ల సునామీ..
?#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/lsfX1uQevb
— Nani (@NameisNani) August 23, 2024
ఇదిలా ఉంటే.. ఈ సినిమా బుక్సింగ్స్‌ను ఓపెన్ చేశారు. ఈ విషయాన్ని కూడా నాని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. అంటే సుందరానికి మూవీ తరువాత నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సరిపోదా శనివారం చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
Ravi Teja : ఆస్పత్రి నుంచి మాస్ మహారాజా డిశ్చార్జ్.. ఆరోగ్యంగానే ఉన్నానంటూ రవితేజ ట్వీట్
The Doors open ?#SaripodhaaSanivaaram #SuryasSaturday pic.twitter.com/8a2QBeY6lm
— Nani (@NameisNani) August 24, 2024