Poco Pad 5G Launch : పోకో ప్యాడ్ 5జీ టాబ్లెట్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Poco Pad 5G Launch : ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,999 కాగా, 8జీబీ+256జీబీ వెర్షన్ రూ.24,999కి అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లలో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు.

Poco Pad 5G with Snapdragon 7s Gen 2 launched in India

Poco Pad 5G Launch : కొత్త పోకో టాబ్లెట్ వచ్చేసింది. భారత మార్కెట్లో పోకో నుంచి పోకో ప్యాడ్ 5జీ పేరుతో మొట్టమొదటి టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. ఈ టాబ్లెట్ భారీ 12.1-అంగుళాల డిస్‌ప్లే స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2, భారీ 10,000mAh బ్యాటరీతో వస్తుంది. పోకో ప్యాడ్ 5జీ పిస్తా గ్రీన్, కోబాల్ట్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ టాబ్లెట్ సేల్ భారత మార్కెట్లో ఆగస్టు 27, 2024న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది.

ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.22,999 కాగా, 8జీబీ+256జీబీ వెర్షన్ రూ.24,999కి అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లలో ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3వేలు తగ్గింపు పొందవచ్చు. ఫస్ట్ సేల్‌లో విద్యార్థులకు అదనంగా రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. తగ్గింపు తర్వాత రెండు వేరియంట్‌లకు ధర రూ. 19,999, రూ. 21,999 అవుతుంది.

Read Also : Poco F6 Deadpool : కొత్త ఫోన్ కొంటున్నారా? పోకో ఎఫ్6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు వివరాలివే!

మొదటి 1500 మంది కస్టమర్‌లు కూడా ఒక ఏడాది టైమ్స్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా పొందవచ్చు. కొనుగోలుదారులందరూ ఎంఎస్ ఆఫీసు 365కి కేవలం రూ. 1కి 6 నెలల సభ్యత్వాన్ని పొందవచ్చు. ప్రముఖ బ్యాంకులతో 3 లేదా 6 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లలలో అందుబాటులో ఉన్నాయి.

పోకో ప్యాడ్ 5జీ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఈ పోకో డివైజ్ కేవలం 7.52ఎమ్ఎమ్ సన్నగా ఉంటుంది. 568 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఈ ప్యాడ్ 5జీ టాబ్లెట్ 2560×1600 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ సింక్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 12.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 16:10 యాస్పెక్ట్ రేషియో విస్తారమైన స్క్రీన్ స్టోరేజీని అందిస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్‌తో కంటెంట్ పవర్‌ఫుల్ వివరణాత్మకంగా కనిపిస్తుంది. యూజర్ల కళ్ళను ప్రొటెక్ట్ చేసేలా డివైజ్ తక్కువ నీలి కాంతి, ఫ్లికర్-రహిత వ్యూ కోసం (TœV) రైన్‌ల్యాండ్ సర్టిఫికేట్ పొందింది.

పోకో ప్యాడ్ 5జీ కేవలం విజువల్స్‌లో మాత్రమే కాదు.. క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌తో అసాధారణమైన ఆడియో క్వాలిటీని అందిస్తుంది. డాల్బీ అట్మోస్‌కు సపోర్టుగా టాబ్లెట్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మూవీలను చూడటం, మ్యూజిక్ వినడం లేదా కంటెంట్‌ని క్రియేట్ చేయడం వంటి వాటికి సపోర్టు చేస్తుంది. టాబ్లెట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆధారితమైనది. 2.4GHz వరకు ఆక్టా-కోర్ సీపీయూని కలిగి ఉంది. ఈ పవర్‌ఫుల్ ప్రాసెసర్ 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. అదనంగా, మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 1.5టీబీ వరకు విస్తరించవచ్చు. వినియోగదారులకు ఫైల్‌లు, యాప్‌ కోసం చాలా స్టోరేజీని అందిస్తుంది.

బ్యాటరీ లైఫ్ పోకో ప్యాడ్ 5జీ మరో సూట్. ఈ డివైజ్ 10,000mAh బ్యాటరీతో వస్తుంది. రోజంతా డివైజ్ వర్క్ చేసేలా తగినంత పవర్ అందిస్తుంది. రీఛార్జ్ చేయాల్సి వస్తే.. 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ టాబ్లెట్ వెంటనే పనిచేస్తుంది. విద్యార్థులు, ప్రయాణికులు, బిజీ షెడ్యూల్‌లలో సులభంగా వినియోగించుకోవచ్చు. నిపుణులకు ఈ టాబ్లెట్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

పోకో ప్యాడ్ టాబ్లెట్ 5జీ కనెక్టివిటీతో వస్తుంది. వేగంగా డౌన్‌లోడ్‌, స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చు. ఇంట్లో లేదా ఆఫీసులో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని పొందవచ్చు. సరికొత్త వై-ఫై 6 ప్రమాణానికి కూడా సపోర్టు ఇస్తుంది. బ్లూటూత్ 5.2 వైర్‌లెస్ డివైజ్‌లలో స్టేబుల్ కనెక్షన్‌లను అందిస్తుంది. టాబ్లెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా షావోమీ హైపర్ఓఎస్‌లో రన్ అవుతుంది. సున్నితమైన, ఫీచర్-రిచ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది.

Read Also : TVS Jupiter 110 Launch : కొత్త టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు