Best Smartphones 2023 : కొత్త ఫోన్ కావాలా? టాప్ 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best Smartphones 2023 : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో Samsung Galaxy M34, Lava Agni 2, iQOO Z7s ఫోన్లపై భారీ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Best Smartphones 2023 : మీరు రూ. 35వేల లోపు అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌ల కోసం చూస్తున్నారా? అయితే, సరైన సమయం. మీ అవసరాలకు ఏది సరిపోతుందో నిర్ణయించుకోవచ్చు. అమెజాన్ (Red Hot Deals)లో భాగంగా టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. మీరు ఎంచుకున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లలో కొన్నింటిపై మరిన్ని ఆఫర్లను పొందవచ్చు. తగ్గింపు ధర తర్వాత అర్హతగల కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. Samsung Galaxy M34, Lava Agni 2, iQOO Z7sతో సహా స్మార్ట్‌ఫోన్‌ల లిస్టును ఓసారి చెక్ చేయండి.

రూ. 35వేల లోపు బెస్ట్ 5 స్మార్ట్‌ఫోన్‌లివే :
Samsung Galaxy M34 : ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 13MP సెల్ఫీ కెమెరాతో పాటు 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 6GB RAM, 128GB స్టోరేజీతో Exynos 1280 SoC ద్వారా శక్తిని పొందుతుంది. అమెజాన్ సేల్ సమయంలో, శాంసంగ్ గెలాక్సీ M34 5G ఫోన్ రూ.24999కి సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ కేవలం 34 శాతం తగ్గింపుతో రూ.16499కి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Unlock Amazon Account : మీ అమెజాన్ అకౌంట్ లాక్ అయిందా? పాస్‌వర్డ్ లేకుండానే ఇలా ఈజీగా అన్‌లాక్ చేసుకోవచ్చు తెలుసా?

Lava Agni 2 : ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ 2.6GHz MediaTek డైమెన్సిటీ 7050 6nm ప్రాసెసర్‌తో పాటు 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్, 2MP మాక్రో, 2MP డెప్త్ కెమెరాతో కూడిన క్వాడ్-కెమెరాను కలిగి ఉంది. 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. లావా అగ్ని 2 ధర రూ.25999, అయితే, అమెజాన్ నుంచి 23 శాతం తగ్గింపుతో రూ.19,999కి పొందవచ్చు.

Best Smartphones Details in Telugu

iQOO Z7s : 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.38-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Qualcomm Snapdragon 695 8nm చిప్‌సెట్‌తో పాటు 6GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. 64MP ప్రైమరీ కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 44W ఫ్లాష్ ఛార్జ్‌తో వస్తుంది. కేవలం 23 నిమిషాల్లో డివైజ్ 50 శాతం పవర్-అప్ చేస్తుంది. iQOO Z7s రూ.23999కి రిటైల్ అవుతుంది, అయితే, అమెజాన్ సేల్ సమయంలో 33 శాతం తగ్గింపుతో రూ.15999కి సొంతం చేసుకోవచ్చు.

Realme Narzo 60 : ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. రియల్‌మి నార్జో 60 ఫోన్ వెనుకవైపు 64MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మీరు ఫ్రంట్ సైడ్ 16MP సెల్ఫీ షూటర్‌ని పొందవచ్చు. MediaTek డైమెన్సిటీ 6020 SoC ద్వారా ఆధారితంగా 8GB RAMతో పొందవచ్చు. రియల్‌మి నార్జో ఫోన్ 60 ధర రూ.19999, అమెజాన్ నుంచి 18 శాతం తగ్గింపుతో రూ.16499కి పొందవచ్చు.

Honor 90 :
ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు Qualcomm Snapdragon 7 Gen 1 ద్వారా పవర్ అందిస్తుంది. 200MP అల్ట్రా-క్లియర్ ప్రైమరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 5000mAh బ్యాటరీతో బ్యాకప్ చేస్తుంది. వాస్తవానికి హానర్ 90 రూ.49999కి రిటైల్ అవుతుంది, అయితే, అమెజాన్ సేల్ సమయంలో 32 శాతం తగ్గింపుతో రూ.33999కి పొందవచ్చు.

Read Also : Amazon Great Indian Festival Sale : రూ. 35వేల లోపు ధరకే టాప్ 3 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఈ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

ట్రెండింగ్ వార్తలు