China Fastest internet : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్.. ఒక సెకనులో టైగర్ 3 మూవీని 150 సార్లు డౌన్‌లోడ్ చేయొచ్చు!

China Fastest internet : సెకనుకు 1.2 టెరాబిట్ల డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగల సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను చైనా ప్రారంభించింది. టైగర్ 3 లాంటి సినిమాని ఒక సెకనులో 150 సార్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

China launched the fastest internet in the world

China Fastest internet : ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ యుగం.. టెక్నికల్‌గా చాలావరకూ క్షణాల్లోనే పనులు పూర్తి చేయొచ్చు. అంతగా టెక్ అడ్వాన్స్ అయింది. అంతే తగట్టుగా ఇంటర్నెట్ సర్వీసులు కూడా వేగవంతమయ్యాయి. అదే ఒకప్పుడు అయితే, ఏదైనా మూవీని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేయడం చాలా పెద్ద విషయం. కేవలం 100ఎంబీ డౌన్‌లోడ్ చేయడానికి గంటల కొద్ది సమయం తీసుకుంటుంది. అలాంటి రోజులు మీకు గుర్తుందా? కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇంటర్నెట్ వేగం పెరిగింది.

Read Also : Apple iPhone 15 Order : ఇదేంటి భయ్యా.. ఆపిల్ స్టోర్‌లో ఐఫోన్ 15 ఆర్డర్ చేస్తే.. ఇంటికి ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది..!

ఏదైనా డేటాను ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా ఈజీగా మారింది. ఈ విషయంలో చైనా ఒక్క అడుగు ముందుకు వేసింది. చైనా నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను ప్రారంభించింది. ఈ ఇంటర్నెట్ వేగం ఎంతంటే? ఒక మాటలో చెప్పాలంటే.. టైగర్ 3 వంటి మూవీని సెకనులో 150 సార్లు డౌన్‌లోడ్ చేయగల అద్భుతమైన వేగాన్ని కలిగి ఉంది. మీరు నమ్మడం లేదా? అయితే, దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

China fastest internet in the world

ప్రస్తుత ఇంటర్నెట్ వేగం కన్నా పది రెట్లు ఎక్కువ :
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను ప్రారంభించింది. ఇది సెకనుకు 1.2 టెరాబిట్ల డేటాను ప్రసారం చేయగలదు. అంటే.. ఇంటర్నెట్ వేగం ప్రస్తుత సగటు ఇంటర్నెట్ వేగం కంటే పది రెట్లు ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇంటర్నెట్ వేగం సెకనుకు కేవలం 100 గిగాబిట్‌ల వద్ద పనిచేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఇటీవల అప్‌గ్రేడ్ చేసిన 5వ తరం ఇంటర్నెట్2 నెట్‌వర్క్ కూడా గరిష్టంగా సెకనుకు 400 గిగాబిట్‌ల వేగాన్ని చేరుకుంటుంది.

కొత్తగా ప్రారంభమైన ఇంటర్నెట్ అవస్థాపన 3వేల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ విస్తారమైన నెట్‌వర్క్ ద్వారా బీజింగ్, వుహాన్, గ్వాంగ్‌జౌలను కలుపుతుంది. సింఘువా యూనివర్శిటీ చైనా మొబైల్, హువావే టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్‌లు సంయుక్తంగా ఇంటర్నెట్‌ను ప్రారంభించాయి. జూలైలో యాక్టివ్ అయినప్పటి నుంచి నెట్‌వర్క్ కఠినమైన పరీక్షలు ఎదురయ్యాయి.

సెకను లోపు టైగర్ 3 మూవీ 150 సార్లు డౌన్‌లోడ్ :
హువావే (Huawei Technologies) వైస్-ప్రెసిడెంట్ వాంగ్ లీ కొత్తగా ప్రారంభించిన నెట్‌వర్క్ ఎంత వేగవంతమైనదో వివరించారు. ఇంటర్నెట్ చాలా వేగవంతమైనదని, కేవలం ఒక సెకనులో 150 హై-డెఫినిషన్ ఫిల్మ్‌లకు సమానమైన డేటాను బదిలీ చేయగలదని ఆయన అన్నారు. అంటే.. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్ 3 వంటి హెచ్‌డీ మూవీ ఈ కొత్త ఇంటర్నెట్ కనెక్షన్‌లో సెకనులోపు 150 సార్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

China fastest internet

మరోవైపు, చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన ఎఫ్ఐటీఐ ప్రాజెక్ట్ లీడర్ వు జియాన్‌పింగ్ ఈ నెట్‌వర్క్ కేవలం సక్సెస్‌ఫుల్ ఆపరేషన్ మాత్రమే కాదని, చైనాకు ఇంకా వేగవంతమైన ఇంటర్నెట్ అందించడానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని వివరించారు. ఇంతలో, సింఘువా యూనివర్శిటీకి చెందిన జు మింగ్‌వీ కొత్త ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను సూపర్‌ఫాస్ట్ రైలు ట్రాక్‌తో పోల్చారు. అదే మొత్తంలో డేటాను బదిలీ చేయగల 10 సాధారణ ట్రాక్‌ల అవసరాన్ని భర్తీ చేస్తుందని వివరించారు. సిస్టమ్ నిర్వహణను సులభతరం చేయడమే కాకుండా చాలా ఖర్చుతో కూడుకున్నదిగా వివరించారు.

ప్రపంచంలో ఎలాంటి మార్పులు రావచ్చు :
1.2 టెరాబిట్ ఇంటర్నెట్ అనేది డేటా కోసం సూపర్-ఫాస్ట్ హైవేని కలిగి ఉంటుంది. ప్రతిఒక్కరికీ సరికొత్త అవకాశాలను అందించగలదు. ప్రపంచ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాదు.. అవకాశాల యుగానికి నాంది పలికింది. మొత్తం సినిమాలను డౌన్‌లోడ్ చేయడానికి కేవలం సెకన్లు పట్టే ప్రపంచాన్ని ఊహించండి..

లాగ్-ఫ్రీ వీడియో కాన్ఫరెన్సింగ్ సమావేశాలు ప్రమాణంగా మారతాయి. వర్చువల్ రియాలిటీ ఎక్స్‌పీరియన్స్ భౌతికపరమైన అడ్డంకులను సజావుగా అధిగమించగలవు. ఇలాంటి వేగవంతమైన ఇంటర్నెట్ పరిశ్రమల అంతటా ఆవిష్కరణలకు ఆజ్యం పోస్తుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, శాస్త్రీయ పరిశోధన వంటి లెక్కలేనన్ని ఇతర రంగాలలో పురోగతికి దారితీయనుంది.

Read Also : iPhone 14 Users : ఐఫోన్ 14 యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ శాటిలైట్ సర్వీసు మరో ఏడాది ఉచితంగా పొందవచ్చు!

ట్రెండింగ్ వార్తలు